వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవసరాల మేరకు... దక్షిణాదిన ఏపీ ఒక్కటే: తెలంగాణకు అమ్మనున్న బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రెండువేల మెగావాట్ల విద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రానికి అమ్మనుంది. పవర్ ట్రేడింగ్ కార్పోరేషన్ (పిటిసి) ద్వారా దీనిని తెలంగాణకు ఇవ్వనుంది. 2016 జూన్ నెల నుంచి 2017 మే నెల వరకు ఏపీలో మిగులు విద్యుత్ ఉండనుందని ఏపీ ట్రాన్స్‌కో పంపిణీ కంపెనీలకు సమాచారమిచ్చింది.

ప్రతి నెల దాదాపు 300 మెగావాట్ల నుంచి 500 మెగావాట్ల వరకు ఏడాది పాటు మిగులు విద్యుత్ ఉండనుందని చెప్పింది.

Surplus AP to sell Telangana 2,000 MW power

అదే సమయంలో తెలంగాణ డిస్కమ్‌లు మే 27, 2016 నుంచి మే 25, 2017 మధ్య 2,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ఏపీ దృష్టికి వచ్చిది. ఈ నేపథ్యంలో ఏపీ మిగులు విద్యుత్‌ను తెలంగాణకు ఇచ్చే అవకాశముంది.

కాగా, ఏడాది మొత్తం మిగులు విద్యుత్ ఉండనుందని ఏపీ డిస్కమ్‌లు చెబుతున్నాయి. ఏడాది మొత్తం మిగులు విద్యుత్ ఉండటం ఇది మొదటిసారి. దక్షిణ భారత దేశంలో అవసరమైన మేర విద్యుత్ ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ.

English summary
AP will sell 2,000 MW power to Telangana through the Power Trading Corporation, according to a recent decision of the AP Cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X