హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమాలపై కెసిఆర్ సీరియస్: ముగ్గురి తొలగింపు, సివికి కంగ్రాట్స్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ విషయంలో వైద్యారోగ్యశాఖ వ్యవహరించిన తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వైన్‌ఫ్లూ పరిస్థితిపై ఆయన సమీక్షించారు. స్వైన్‌ఫ్లూ విషయంలో సరిగా వ్యవహరించకపోవటం, పారామెడికల్ పోస్టుల భర్తీని ఏజెన్సీలకు అప్పగించటం, 108 అంబులెన్స్ వాహనాల కొనుగోలులో అక్రమాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు.

ఇందులోభాగంగా వైద్యారోగ్యశాఖకు ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ పిల్లి సాంబశివరావుపై వేటువేశారు. ఆయన స్థానంలో కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి బుద్దప్రకాశ్‌కు డీహెచ్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ రాజీవ్‌శర్మ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కుటుంబ సంక్షేమశాఖలో ముఖ్య పరిపాలన అధికారిగా ఇంఛార్జ్ బాధ్యతల్లో ఉన్న శ్రీనివాసరెడ్డిని కూడా విధుల నుంచి తప్పించారు. ఆర్‌డీ కార్యాలయంలో డీడీగా పరిమితం చేశారు.

అంతకుముందు వరంగల్‌లోని వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా నియమించిన ఉస్మానియా ప్రొఫెసర్ బి రాజును తప్పించారు. ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి రాజయ్యపై ఆరోపణలు రావడం, దీనికి సంబంధించి నిఘా సంస్థలు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వరుసగా కీలకమైన ముగ్గురు అధికారులను తొలగిస్తూ నేరుగా సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అర్ధరాత్రి మంత్రులతో కెసిఆర్ భేటీ

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాఖల మార్పుపై దృష్టి సారించారు. గురువారం అర్థరాత్రి అందుబాటులో ఉన్న పలువురు సీనియర్‌ మంత్రులతో విడివిడిగా సమావేశమయ్యారు. శాఖల మార్పుకు సంబంధించి వారి అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఇది సరైన సమయం కాదని మంత్రులు అభిప్రాయపడినట్లు సమాచారం. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలే గడిచిందని, శాఖలపై పట్టుకు కొంతసమయం పడుతుందని వివరించినట్లు తెలుస్తోంది.

ఛాతీ ఆస్పత్రిని సందర్శించిన కెసిఆర్

చెస్ట్ ఆస్పత్రిలో కెసిఆర్

చెస్ట్ ఆస్పత్రిలో కెసిఆర్

వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఛాతీవ్యాధుల (టీబీ) ఆస్పత్రిని సిఎం కెసిఆర్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు.

చెస్ట్ ఆస్పత్రిలో కెసిఆర్

చెస్ట్ ఆస్పత్రిలో కెసిఆర్

ఈ సందర్భంగా అక్కడి అధికారులతో కలిసి ఆస్పత్రిపరిసరాలను పరిశీలించారు. ఛాతీవ్యాధుల ఆస్పత్రి ఎంత విస్తీర్ణంలో ఉంది..? ఎన్ని ఎకరాల ఖాళీస్థలం ఉంది..? అనే విషయాలను అధికారులతో చర్చించారు.

చెస్ట్ ఆస్పత్రిలో కెసిఆర్

చెస్ట్ ఆస్పత్రిలో కెసిఆర్

ఆస్పత్రికి పక్కనే ఉన్న ఆయుర్వేద ఆస్పత్రి, రోడ్డుకు అవతల ఉన్న మానసిక రోగుల చికిత్సాలయం ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంపై సిఎం చర్చించారు.

సివి ఆనంద్‌కు కెసిఆర్ అభినందనలు

సివి ఆనంద్‌కు కెసిఆర్ అభినందనలు

ఎన్నికల సంఘం నుంచి ప్రత్యేక అవార్డును పొందిన సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్‌ను అభినందిస్తున్న సిఎం కెసిఆర్.

వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఛాతీవ్యాధుల (టీబీ) ఆస్పత్రిని సిఎం కెసిఆర్ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో కలిసి ఆస్పత్రిపరిసరాలను పరిశీలించారు. ఛాతీవ్యాధుల ఆస్పత్రి ఎంత విస్తీర్ణంలో ఉంది..? ఎన్ని ఎకరాల ఖాళీస్థలం ఉంది..? అనే విషయాలను అధికారులతో చర్చించారు. ఆస్పత్రికి పక్కనే ఉన్న ఆయుర్వేద ఆస్పత్రి, రోడ్డుకు అవతల ఉన్న మానసిక రోగుల చికిత్సాలయం ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంపై సిఎం చర్చించారు.

ఈ సందర్భంగా వైద్యుడు డాక్టర్ ఖాన్ తదితరులు సీఎంకు ఆస్పత్రి పరిసరాలు తదితర వివరాలు తెలియజేశారు. ఆ ఖాళీ స్థలంలో ప్రభుత్వం చేపట్టబోయే అభివృద్ధి నిర్మాణాల నేపథ్యంలో స్థలాలను సీఎం స్వయంగా పరిశీలించారని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

English summary
Telangana chief minister K Chandrasekhar Rao transferred the Director of Heath R Sambasiva Rao for poor handling of swine flu outbreak in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X