వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భీమవరంలో సైకో కలకలం: పట్టుకోవడానికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్‌పై దాడి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాలో సిరంజీ సైకో హడలెత్తిస్తున్నాడు. తాజాగా శనివారం భీమవరం మండలంలోని అన్న కోడేరు గ్రామ శివారు ప్రాంతంలో సైకో కలకలం సృష్టించాడు. సైకోను పట్టుకోవాడనికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్ పై దాడి చేసి గాయపర్చి పారిపోయాడు.

ప్రస్తుతం ఆటో డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటాన స్థలానికి చేరుకున్నారు. శనివారం నాడు సైకో కలకలం సృష్టించాడన్న వార్తులు రావడంతో భీమవరం చుట్టుపక్కల ప్రాంతంలో పోలీసులు భారీ ఎత్తున నిఘాను పెంచారు.

Syringe Psycho Hulchul in West Godavari District

శనివారం జరిగిన ఆటోడ్రైవర్ ఘటనతో వారం రోజుల వ్యవధిలో 15 మందికి ఇంజెక్షన్‌లు చేశాడు. వరుస ఘటనలతో జిల్లాలో జనం భయాందోళనలు చెందుతున్నారు. ఇంజెక్షన్‌ సైకోను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది.

ఇప్పటికే సైకో ఊహా చిత్రాన్ని పోలీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సైకోను పట్టుకోవడానికి 40 బృందాలని నియమించారు. సైకోని ఆచూకీ తెలిపిన వారికి ప్రభుత్వం ఇప్పటికే రూ. లక్ష బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం అడిషినల్‌ డీజీ ఆర్‌పీ ఠాగూర్‌, ఐజీపీ విశ్వజిత్‌ బాధితులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మహిళలపై దాడులు చేస్తున్న వ్యక్తి.. భీమవరం, ఉండి నియోజకవర్గల్లోని ప్రాంతాలకు చెందిన వాడై ఉంటాడని భావిస్తున్నామన్నారు. 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉండవచ్చని చెప్పారు.

English summary
Syringe Psycho Hulchul in West Godavari District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X