చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కౌంటర్: ఏపిలో తమిళ బస్సులు అడ్డుకున్నారు

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: శేషాచలం ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందని బస్సులను అడ్డుకుంటున్న నేపథ్యంలో ఏపికి వచ్చే తమిళనాడు బస్సులను అడ్డుకున్నారు చిత్తూరు జిల్లా వాసులు. శనివారం వరదాయిపాలెంలో తమిళనాడుకు చెందిన బస్సులను ప్రజలు అడ్డుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బస్సులను తమిళనాడులో అడ్డుకుంటున్నందుకే ఈ విధంగా నిరసన చేపట్టామని తెలిపారు. ఏపి బస్సులను తమిళనాడులోకి రానివ్వకుంటే సోమవారం నుంచి తమిళనాడు నుంచి వచ్చే అన్ని బస్సులను ఏపిలోకి రానీయకుండా అడ్డుకుంటామని వరదాయిపాలెం వాసులు తేల్చి చెప్పారు.

 Tamil nadu buses stopped in Chittoor district

అంతేగాక, ఈ మేరకు చెన్నైలోని కోయంబేడు డిపోకు గ్రామస్తులు ఓ లేఖను కూడా పంపించారు. ఏప్రిల్ 7న శేషాచలంలో అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తమిళనాడుకు చెందిన 20మంది కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ ఎన్‌కౌంటర్ బూటకమని పేర్కొంటూ తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు, సంఘాలు గత కొన్ని రోజులుగా ఏపి బస్సులను తమిళనాడుకు రాకుండా అడ్డుకుంటున్నాయి. అంతేగాక, ఘటన జరిగిన తర్వాతి రోజునే ఏపి బస్సులను ధ్వంసం చేయడంతోపాటు, ఏపికి చెందిన వారి దుకాణాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే.

English summary
Tamil nadu buses are stopped by some villagers, and protested in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X