హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ టీసీఎస్‌లో 2 వేల మందికి ఉద్వాసన... ప్రపంచ వ్యాప్తంగా 30వేల మంది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రానున్న కొన్ని నెలల్లో భారీ ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందని సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా తన సంస్ధల్లో పని చేస్తున్న 25 వేల నుంచి 30 వేల మందిని విధుల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది.

htmltelugu

ముఖ్యంగా మిడిల్ లెవల్ మేనేజర్లు, కన్సల్టెంట్లులకు భారీగా ఉద్వాసన పలకనుంది. టీసీఎస్ ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలకడం విశేషం. గత రెండు సంవత్సరాలుగా ఎలాంటి పురోగతి చూపని అసిస్టెంట్ కన్సల్టెంట్లు, బ్యాండ్ సి కలిగి ఉన్న ప్రాజెక్టు మేనేజర్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

ఒక్క హైదరాబాద్ టీసీఎస్‌లోనే దాదాపు 2 వేల మందికి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. ఉద్యోగుల ఉద్వాసన పారదర్శకంగా లేదని... అన్యాయంగా తీసివేస్తున్నారని సంస్థలో పనిచేస్తున్న కొందరు వాపోతున్నారు. ట్రైనీ, జూనియర్ ఉద్యోగులతో తక్కువ వేతనంతో పనిచేయించుకోవచ్చనే ఆలోచనతో... సీనియర్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

English summary
India’s largest IT services company: TCS is firing employees en-masse – Upto 25,000 to 30,000 employees can be fired in the next few months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X