అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫిరాయింపులు: తెరమీదికి జగన్ పై ఈడీ కేసులు , బాబు వ్యూహమిదే

వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా టిడిపి ఏ రకంగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందో వివరించారు.అయితే ఈ అంశాన్ని ప్రజల దృష్టి మరల్చేందుకుగాను జగన్ ఈడీ కేసులను ఉపయోగించుకోవాలని టిడిపి.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా టిడిపి ఏ రకంగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందో వివరించారు.అయితే ఈ అంశాన్ని ప్రజల దృష్టి మరల్చేందుకుగాను జగన్ ఈడీ కేసులను ఉపయోగించుకోవాలని టిడిపి భావిస్తోంది. ఈ మేరకు పార్టీ శ్రేణులకు ఆ పార్టీ నాయకత్వం ఈ మేరకు స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది.

ఈ నెల 2వ, తేదిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గాన్ని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పునర్వవ్యవస్థీకరించారు. మంత్రివర్గ పునర్వవ్యవస్థీకరణలో నలుగురు వైసీపి నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలకు స్థానం కల్పించారు.

అయితే ఈ అంశాన్ని వైసీపి అధినేత జగన్ ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకొన్నారు. రాజ్యాంగ ఉల్లంఘనలను టిడిపి అధినేత పాల్పడ్డారని జగన్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అన్ని వేదికలపై టిడిపి అధినేత అనుసరించిన రాజ్యాంగ ఉల్లంఘనలను ప్రస్తావించారు.

మరో వైపు ఢిల్లీ వేదికగా వైసీపి అధినేత జగన్ చంద్రబాబు వ్యవహరించిన తీరును ఎండగట్టారు. రాష్ట్రపతితో పాటు ఇతర పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులను కలుసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాలను వివరించారు.

జగన్ కౌంటర్ గా కేసులను ప్రస్తావించనున్న టిడిపి

జగన్ కౌంటర్ గా కేసులను ప్రస్తావించనున్న టిడిపి

మంత్రివర్గంలోకి నలుగురు వైసీపి ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై రాజ్యాంగ ఉల్లంఘనలను టిడిపి ఏ రకంగా పాల్పడిందనే అంశాలపై వైసీపి చేస్తోన్న ప్రచారం టిడిపికి రాజకీయంగా ఇబ్బందులను కల్గిస్తోంది. ఈ పరిణామాలతో టిడిపి ఆత్మరక్షణలో పడింది.అయితే ఈ పరిస్థితి నుండి బయటపడేందుకుగాను జగన్ పై ఉన్న కేసుల అంశాలను ప్రస్తావించాలని టిడిపి భావిస్తోంది.ఇటీల కాలంలో ఈడీ కొన్ని సూట్ కేసు కంపెనీల విషయమై సోదాలు నిర్వహించింది. ఈ విషయమై ఈడీ ట్విట్టర్ వేదికగా చేసిన కామెంట్లను టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. జగన్ పై ఉన్న కేసులను ప్రధానంగా ప్రస్తావించాలని టిడిపి నాయకత్వం భావిస్తోంది. ఈ మేరకు పార్టీ నాయకులకు ఈ మేరకు సంకేతాలను పంపారు బాబు.

జగన్ పై పోరాటానికి బాబు రంగంలోకి

జగన్ పై పోరాటానికి బాబు రంగంలోకి

వైసీపీ అధినేత పార్టీ ఫిరాయింపుల అంశంపై తన ఇమేజ్ కు , పార్టీని దెబ్బతీసేందుకు అనుసరించిన వ్యూహంతో టిడిపి ఆత్మరక్షణలో పడక తప్పని పరిస్థితి నెలకొంది.అయితే అదే సమయంలో ఈడీ కొన్ని సూట్ కేసు కంపెనీలపై దాడులు నిర్వహించడం టిడిపి అందివచ్చిన అంశంగా కన్పించింది. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబునాయుడే నేరుగా జగన్ పై పోరాటానికి సై అంటున్నారు. ఆర్తిక నేరాలతో సంబంధం ఉన్న వ్యక్తి విలువల గురించి మాట్లాడడం సమంజసమా అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగఉల్లంఘనల గురించి ఆర్థిక నేరాల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రశ్నించడం నైతికతా అంటూ చంద్రబాబునాయుడు నేరుగా జగన్ పై ప్రశ్నలను సంధించారు.

సూట్ కేసు కంపెనీలపై ఈడీ దాడులు టిడిపికి కలిసివచ్చేనా?

సూట్ కేసు కంపెనీలపై ఈడీ దాడులు టిడిపికి కలిసివచ్చేనా?

దేశ వ్యాప్తంగా సూట్ కేసు కంపెనీలపై ఈడీ దాడులు నిర్వహించింది.ఈ దాడులకు సంబంధించిన ఈడీ అధికారికంగా చేసిన ట్వీట్ ను టిడిపి ప్రస్తావిస్తోంది. ఈ అంశాలపై జగన్ సమాధానం చెప్పాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని జగన్ ప్రస్తావించి టిడిపిని రాజకీయంగా ఇరుకునపెట్టేందుకు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు ఈ కేసుల అంశాన్ని టిడిపి ప్రధానంగా ప్రస్తావిస్తోంది. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని మరుగునపర్చేలా ఈడీ దాడుల అంశాన్ని తెరమీదికి తీసుకురావాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.ఇదే తరుణంలో గతంలో జగన్ పై ఉన్న కేసుల అంశాలను కూడ మరోసారి టిడిపి ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఈ కేసుల అంశాన్ని తెరమీదికి తీసుకురావడం ద్వారా పార్టీ ఫిరాయింపుల అంశాన్ని తెరమరుగు చేసే అవకాశం లేకపోలేదని టిడిపి వ్యూహంగా కన్పిస్తోంది.

అభివృద్ది కోసం బాబు పోరాటం

అభివృద్ది కోసం బాబు పోరాటం

ఆంద్రప్రదేశ్ అభివృద్దికి వైసీపి అధినేత జగన్ వల్ల కాదనే అభిప్రాయాన్ని వైసీపీ నుండి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేల్లో ఉంది.ఈ మేరకు ఈ అభిప్రాయాన్ని టిడిపి విజయవంతంగా ప్రచారం చేయగలిగింది. మరో వైపు టిడిపి వల్లే అభివృద్ది సాగుతోందనే అభిప్రాయాన్ని ప్రచారం చేయగలిగారు.

చంద్రబాబు రెండు నాల్కల ధోరణిపై జగన్ పోరాటం

చంద్రబాబు రెండు నాల్కల ధోరణిపై జగన్ పోరాటం

టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ఫిరాయింపులపై రెండు నాల్కల ధోరణిని అవలంబిస్తున్నారని వైసీపి ప్రధానంగా ప్రస్తావిస్తోంది. వైసీపి అధినేత జగన్ తెలంగాణలో చోటుచేసుకొన్న పరిణామాలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. తెలంగాణలో టిడిపి నుండి విజయం సాధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో చేరిన సమయంలో గగ్గోలు పెట్టిన చంద్రబాబునాయుడు. వైసీపి ఎమ్మెల్యేలను తన మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేర్చుకోవడం ఏ మేరకు నైతికతగా ప్రశ్నిస్తున్నారు.

English summary
TD is countering YSRC’s attack on defections by bringing up and criticising YSRC chief Jagan Mohan Reddy’s ED cases. The party has also directed its leaders to highlight that late Y.S. Rajasekhar Reddy had been the one to initiate the practice of defection. TD believes that the public will not take the defections seriously, and that it will focus on Jagan’s ED cases instead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X