వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాల ఎఫెక్ట్: రూట్ మార్చిన బాబు, ఒక్కరికే పెత్తనం

నంద్యాల ఎఫెక్ట్‌తో నంద్యాలలో పార్టీ కార్యక్రమాలను ఒక్కరి చేతుల మీదుగా నిర్వహించాలని టిడిపి నిర్ణయం.చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: నంద్యాల ఉపఎన్నికల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సంస్థాగత విషయాల్లో తెలుగుదేశం పార్టీ కొత్త విధానానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకొంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కరికే బాధ్యతలను అప్పగించాలని టిడిపి నాయకత్వం నిర్ణయం తీసుకొంది.

ఆ ఓట్లపైనే టిడిపి, వైసీపీ దృష్టి, జగన్ రోడ్‌షోల వెనుక ప్లాన్ ఇదే!ఆ ఓట్లపైనే టిడిపి, వైసీపీ దృష్టి, జగన్ రోడ్‌షోల వెనుక ప్లాన్ ఇదే!

బహుముఖ నాయకత్వాలతో రాజకీయంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.నంద్యాల ఎన్నికలను పురస్కరించుకొని నిర్వహించిన సర్వే టిడిపికి ముచ్చెమటలు పోయించింది.దీంతో బహుముఖ నాయకత్వాలకు చెక్ పెట్టనుంది.

గంగుల ఎఫెక్ట్: గోస్పాడు ఏకపక్షమేనా, తమ్ముడిని కాదని, వైసీపీకి దెబ్బేనా?గంగుల ఎఫెక్ట్: గోస్పాడు ఏకపక్షమేనా, తమ్ముడిని కాదని, వైసీపీకి దెబ్బేనా?

తెలుగుదేశం పార్టీలో కొత్త వివాదం ప్రారంభమైంది...ఇన్‌ఛార్జ్‌లు.. ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న పోరు పార్టీకి నష్టమని అధిష్టానం గుర్తించింది.. ఇక నుంచి నియోజకవర్గాలలో ఏక వ్యక్తికే పూర్తి పెత్తనాన్ని అప్పగించాలని టీడీపీ పెద్దలు భావించారు.

చిరంజీవి బాటలోనే పవన్, ఆ భయంతోనే నంద్యాలలో తటస్థ వైఖరి!చిరంజీవి బాటలోనే పవన్, ఆ భయంతోనే నంద్యాలలో తటస్థ వైఖరి!

నంద్యాలలో జరిగిన ఓ సంఘటన టీడీపీ నేతలకు జ్ఞానోదయాన్ని కల్గించింది. నియోజకవర్గాలలో స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు.నిర్ణయాలను వాయిదా వేస్తే తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉందని టిడిపి నాయకత్వం గుర్తించింది.

నంద్యాల ఎఫెక్ట్‌తో ప్లాన్ మార్చిన బాబు

నంద్యాల ఎఫెక్ట్‌తో ప్లాన్ మార్చిన బాబు

నంద్యాలలో 2014 ఎన్నికలలో తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా పోటీచేసిన శిల్పా మోహన్‌రెడ్డి ఓడిపోయారు. ఆయనపై గెలుపొందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి ఆ తర్వాత తెలుగుదేశంపార్టీలో చేరారు. ప్రత్యర్థి వచ్చి తమ పార్టీలో చేరడాన్ని శిల్పా సోదరులు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ అవసరాల రీత్యా చంద్రబాబునాయుడు భూమా నాగిరెడ్డిని, అఖిలప్రియను పార్టీలో చేర్చుకొన్నారు.ఈ ఏడాది మార్చి 12న, భూమా నాగిరెడ్డి మరణంతో అక్కడ ఉప ఎన్నిక అవసరమయ్యింది..అయితే భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరిన తర్వాత అభివృద్ది కార్యక్రమాలపై కేంద్రీకరించారు.అయితే శిల్పా మోహన్‌రెడ్డి కూడ చంద్రబాబు కోటాలో నుండి అభివృద్ది కార్యక్రమాలను మంజూరు చేయించుకొన్నారు. తన వర్గీయులకు వాటిని ఇప్పించుకొన్నారు. ప్రస్తుత ఉపఎన్నికల్లో శిల్పా ద్వారా లబ్దిపొందినవారు శిల్పాకే ఓటు వేస్తామని టిడిపి నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ సర్వే షాక్‌తో బాబు పునరాలోచనలో పడ్డారు.

Recommended Video

Nandyal By Polls : Balakrishna's act has created headache to Chandrababu Naidu. | Oneindia Telugu
పోటాపోటీగా నిధుల కోసం ప్రయత్నాలు

పోటాపోటీగా నిధుల కోసం ప్రయత్నాలు

భూమా నాగిరెడ్డి తెలుగుదేశంపార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన నంద్యాలలో రహదారుల వెడల్పు.. మంచినీటి సరఫరా.. గృహనిర్మాణం వంటి పథకాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు కృషి చేశారు. తాను నంద్యాలకు 2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యేగా ఉన్నానని.. మంత్రిగా కూడా పనిచేశానని.. తనకు కూడా గృహాలు ఇవ్వాలని.. పెన్షన్‌లు కూడా మంజూరు చేయాలని శిల్పా మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు. శిల్పా కోరిక మేరకు ముఖ్యమంత్రి తన కోటా నుంచి కొన్ని గృహాలు.. పెన్షన్‌లు కేటాయించారు. దీంతో ఆయన కూడా తన వర్గీయులకు వీటన్నింటిని మంజూరు చేశారు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత శిల్పా మోహన్రెడ్డి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లారు. ఇప్పుడా పార్టీ తరపున నంద్యాల ఉప ఎన్నిక బరిలో నిలిచారు. తెలుగుదేశంపార్టీలో ఉన్నప్పుడు ఇచ్చిన గృహాలు.. పెన్షన్‌ల లబ్ధిదారులు శిల్పాకు విధేయులుగా ఉన్నారు.

నియోజకవర్గంలో ఒక్కరికే పెత్తనం

నియోజకవర్గంలో ఒక్కరికే పెత్తనం

నంద్యాల నియోజకవర్గంలో చోటుచేసుకొన్న పరిణామాలతో టిడిపి నాయత్వం పునరాలోచనలో పడింది. నియోజకవర్గాల్లో బహుముఖ నాయకత్వం వల్ల నష్టమని ఆ పార్టీ అభిప్రాయంతో ఉంది. ఇక ప్రతి నియోజకవర్గంలో . ఒకరికే పెత్తనం అప్పగించాలని డిసైడయ్యింది.. నంద్యాల ఉప ఎన్నిక సర్వే నివేదికలు తెప్పించుకుంటున్న తెలుగుదేశంపార్టీ హైకమాండ్‌ తమ ప్రభుత్వం ద్వారా పెన్షన్‌లు.. గృహాలు పొందినవారు శిల్పాకు ఓటు వేస్తామని చెప్పటాన్ని చూసి జీర్ణించుకోలేకపోతోంది.. ఇక రాష్ర్టంలో ఏ నియోజకవర్గంలో కూడా ఎలాంటి సందేహాలకు తావివ్వకుండా ఏక నాయకత్వం ద్వారా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు తీసుకొంటుంది.

 రాజకీయంగా నష్టపోకుండా జాగ్రత్తలు

రాజకీయంగా నష్టపోకుండా జాగ్రత్తలు

రాజకీయంగా భవిష్యత్తులో నష్టపోకుండా ఉండేందుకుగాను చంద్రబాబునాయుడు నష్టనివారణ చర్యలను తీసుకొంటున్నారు.రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. పాత,కొత్త నాయకుల మధ్య సమన్వయం కుదరడం లేదు.పైగా ఆదిపత్యపోరు సాగుతోంది. దీనికి చెక్ పెట్టాలని బాబు భావిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు.. ప్రకాశం జిల్లా అద్దంకిలతో పాటు మరికొన్ని నియోజకవర్గాలలో కూడా ఇలాంటి సమస్యే ఎదురవ్వడంతో చంద్రబాబు ఇక క్యాడర్‌కు కూడా తగిన సంకేతాలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.

English summary
Tdp chief Chandrababu naidu changed his party policies. one and only leader conduct party activities from every assembly segment, Chandrababu naidu ordered to party leaders recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X