వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డబ్బులు పంచుతూ దొరికారు: శిల్పా మోహన్ రెడ్డికి టిడిపి షాక్, అది శిల్పా లెక్కలోకి

నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రలోభ పెడుతోందంటూ టిడిపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్లను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రలోభ పెడుతోందంటూ టిడిపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

అభిమాని చెంప చెళ్లుపై షాక్: 'బాలకృష్ణ చేయి తగిలితే పులకరింత, తాకితే పుణ్యం'అభిమాని చెంప చెళ్లుపై షాక్: 'బాలకృష్ణ చేయి తగిలితే పులకరింత, తాకితే పుణ్యం'

డబ్బులు పంచుతూ దొరికిపోయారు కాబట్టి

డబ్బులు పంచుతూ దొరికిపోయారు కాబట్టి

ఓటర్లకు నగదు పంచుతూ ఆ పార్టీ కార్యకర్తలు పట్టుబడిన నేపథ్యంలో ఆ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు స్లిప్పులు పంచుతూ వైసిపి నేతలు నగదు పంపిణీ చేయడాన్ని టిడిపి జాతీయ పార్టీ కార్యాలయ కార్యదర్శి టీడీ జనార్దన్‌ కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.

శిల్పా అనుచరులు డబ్బులు జమ చేస్తున్నారు

శిల్పా అనుచరులు డబ్బులు జమ చేస్తున్నారు

ఓటర్ల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తూ నగదును వారి ఖాతాల్లో శిల్పా మోహన్ రెడ్డి అనుచరులు జమ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సాక్షి మీడియా ఏకపక్షంగా

సాక్షి మీడియా ఏకపక్షంగా

వైయస్ జగన్‌కు చెందిన సాక్షి మీడియా ఏకపక్షంగా వార్తలు ప్రసారం చేయడాన్ని కోడ్‌ ఉల్లంఘన కింద పరిగణించాలని టీడీ జనార్దన్‌ మరో ఫిర్యాదు కూడా చేశారు.

ఆ ఖర్చు శిల్పా లెక్కలో వేయాలి

ఆ ఖర్చు శిల్పా లెక్కలో వేయాలి

తమ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా రోజూ సాక్షి పత్రిక, ఛానల్‌లో ప్రచారం చేసే వార్తలతో పాటు వైసిపికి అనుకూలంగా ఇచ్చే వార్తలనూ పేయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఖర్చును వైసిపి అభ్యర్థి శిల్పా ఎన్నికల ఖర్చులో జమ చేయాలని కోరారు.

English summary
Telugu Desam Party leader TD Janardhan complained to Election Commission on YSR Congress Party Nandyal MLA candidate Silpa Mohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X