వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాలలో శాంతిభద్రతలకు విఘాతానికి జగన్ వ్యూహం: టిడిపి

నంద్యాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ శాంతి భద్రతలకు విఘాతం కల్గించేందుకు ప్రయత్నిస్తోందని టిడిపి ఆరోపించింది.ఈ మేరకు టిడిపి ఎంపీలు కొనకళ్ళ నారాయణ, కేశినేని హైద్రాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల అదనపు ప్ర

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నంద్యాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ శాంతి భద్రతలకు విఘాతం కల్గించేందుకు ప్రయత్నిస్తోందని టిడిపి ఆరోపించింది.ఈ మేరకు టిడిపి ఎంపీలు కొనకళ్ళ నారాయణ, కేశినేని హైద్రాబాద్‌లో రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి అనూప్‌సింగ్‌కు ఫిర్యాదుచేశారు.

నంద్యాల ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకొని వైసీపీ చీఫ్ జగన్ చంద్రబాబునాయుడుపై చేసిన విద్వేషపూరిత ప్రసంగాలకు సంబందించిన వీడియో టేపులను టిడిపి ఎంపిలు ఎన్నికల అదనపు ప్రధానాధికారికి అందజేశారు.

Tdp complaints to Election commission against Ysrcp

ఎన్నికల ప్రచారం పేరుతో ఈ నెల 3వ, తేదిన కాల్చి వేయాలని, ఈ నెల 9వ, తేదిన చంద్రబాబుకు ఉరేయాలని చేసిన ప్రసంగాలను టిడిపి ఎంపీలు ప్రస్తావించారు.

2016లో చంద్రబాబు పని అయిపోయిందని జగన్ చేసిన ప్రకటనలను కూడ వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకుగాను వైసీపీ ప్రయత్నాలను చేస్తోందని టిడిపి నేతలు ఆరోపణలు చేశారు.

తాజాగా శుక్రవారం నాడు వైసీపీకి చెందిన వారు డబ్బులు పంచుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకొన్న విషయాన్ని టిడిపి నేతలు ప్రస్తావించారు. ఈ విషయమై వైసీపీపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను కోరారు.

English summary
Tdp Mp's K. Narayana and Kesineni Nani complaint to Election commission against Ysrcp on Friday. Ysrcp chief Jagan speech video tapes also submitted to Election commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X