వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి కౌన్సిలర్‌ని చంపిన వైసిపి మద్దతుదారులు

By Pratap
|
Google Oneindia TeluguNews

TDP leader hacked to death in ananthapur district
అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జయలక్ష్మీ థియేటర్‌ ఆవరణలో గురువారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్‌ సాధిక్‌వలిని వైసీపీ నేతలు అత్యంతదారుణంగా నరికి చంపారు. సిఐ సుధాకర్‌రెడ్డి కథనం ప్రకారం తాడిపత్రి మండలం వీరాపురంలో జరిగిన దాడులకు సంబంధించి విమర్శలు చేశాడనే ఆగ్రహంతో వైసీపీ అదనపు సమన్వయకర్త రమేష్‌రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు అనిల్‌కుమార్‌రెడ్డి, వంశీ, సురేష్‌రెడ్డి, జావెద్‌ , నరసింహారెడ్డి, రామమునిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, మరికొందరు కలిసి పథకం పన్నారు.

ఇందులో భాగంగా థియేటర్‌ నుంచి మోటారుసైకిల్‌ పై వస్తున్న సాధిక్‌వలికి కళ్లలో కారం కొట్టి వేటకొడవళ్లతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడ్డ సాధిక్‌వలిని చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో జావెద్‌తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న ప్రభుత్వ ఛీప్‌విప్‌ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సాధిక్‌వలి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ హత ్యను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో భారీ బందోస్తు ఏర్పాటు చేశారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ రాజశేఖర్‌బాబు, అడిషనల్‌ ఎస్పీ మాల్యాద్రి సందర్శించారు.

వివాహిత అనుమానాస్పద మృతి

అమడగూరు మండల పరిధిలోని పేరంవాండ్లపల్లికి చెందిన తులసి(28) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగు చూసింది. మృతురాలు సోమవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి మండల ఎస్సై రమేష్‌రెడ్డి తెలిపిన మేరకు వివరాలిలా వున్నాయి. పేరంవాండ్లపల్లికి చెందిన తులసి పట్రవాండ్లపల్లి సమీపంలోని కంప చెట్ల పొదల్లో శవంగా పడి వుండి గుర్తుపట్టని స్థితిలో వుంది.

పశువులకాపర్లు విషయం తెలుసుకొని పోలీసులు అక్కడికి వెళ్లి శవాన్ని పరిశీలించగా ఆమె చేతికి గల సెల్ నెంబరు ఆధారంగా ఆమె పేరంవాండ్లపల్లికి చెందిన తులసిగా గుర్తించారు. ఆత్మహత్య చేసుకుందా లేక హత్య చేసి పడేశారా అనేది పోస్టుమార్టం అనంతరం తేలాల్సి వుంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్సై రమేష్‌రెడ్డి తెలిపారు.

బాణసంచా పట్టివేత

ధర్మవరం పట్టణంలోని నివాస గృహాల మధ్య లైసెన్సు కలిగిన కొందరు వ్యాపారులకు చెందిన బాణసంచాను గోడౌన్ నుండి తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు.

English summary
Telugudesam party leader Sadiq Vali has been hacked to death by YSR Congress supporters at Tadipatri in Ananthapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X