చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగు తమ్ముళ్ల రచ్చ: పిడిగుద్దులు, కర్రలతో దాడులు, బాబు సీరియస్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: తిరుపతి తెలుగుదేశం నాయకులు రచ్చరచ్చ సృష్టించారు. తిరుపతిలో మహానాడు వేదిక నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంగణంలో బాహాబాహీకి దిగారు.

కర్రలు, ముష్టిఘాతాలతో పరస్పర దాడులు చేసుకోవడంపై పార్టీ నాయకుల నుంచే విమర్శలు వచ్చాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

చంద్రబాబు సీరియస్

మహానాడు వేదిక నిర్మాణ పనులు జరుగుతుండగా, తిరుపతి స్థానిక నాయకులు బాహాబాహీకి దిగిన సంఘటనను తెదేపా అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఘటన అన్ని ఛానళ్లలో ప్రసారం కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను జిల్లా పార్టీ అధ్యక్షుడు గౌనివారి శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు.

తెలుగు తమ్ముళ్ల రచ్చ

తెలుగు తమ్ముళ్ల రచ్చ

తిరుపతి తెలుగుదేశం నాయకులు రచ్చరచ్చ సృష్టించారు. తిరుపతిలో మహానాడు వేదిక నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంగణంలో బాహాబాహీకి దిగారు.

తెలుగు తమ్ముళ్ల రచ్చ

తెలుగు తమ్ముళ్ల రచ్చ

కర్రలు, ముష్టిఘాతాలతో పరస్పర దాడులు చేసుకోవడంపై పార్టీ నాయకుల నుంచే విమర్శలు వచ్చాయి. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

తెలుగు తమ్ముళ్ల రచ్చ

తెలుగు తమ్ముళ్ల రచ్చ

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. దాడులకు కారణాలు చూస్తే అంతర్గత విభేదాలని స్పష్టమవుతోంది. బుధవారం జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి బొజ్జల తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మహానాడు ఏర్పాట్లపై చర్చించారు.

తెలుగు తమ్ముళ్ల రచ్చ

తెలుగు తమ్ముళ్ల రచ్చ

సమావేశానికి పూర్తిస్థాయిలో ద్వితీయశ్రేణి నాయకులు కొందరు హాజరుకాలేదు. దీనిని కొందరు పార్టీ కార్యకర్తలే వీడియో తీసి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లలో పెట్టి.. మహానాడుపై స్థానిక నాయకులు నిర్లక్ష్యం చూపిస్తున్నారంటూ వాఖ్యలు చేశారు. ఇది పెద్ద దుమారం రేపింది.

తెలుగు తమ్ముళ్ల రచ్చ

తెలుగు తమ్ముళ్ల రచ్చ

గురువారం మహానాడు వేదిక వద్ద పనులు జరుగుతుండగా టిడిపి నాయుకుడు కోడూరు బాలసుబ్రహ్మణ్యం అనుచరులు అలీఖాన్‌, మధులు అక్కడికి వచ్చారు.

తెలుగు తమ్ముళ్ల రచ్చ

తెలుగు తమ్ముళ్ల రచ్చ

అక్కడే ఉన్న నగర అధ్యక్షుడు దంపూరు భాస్కర్‌ యాదవ్‌, కృష్ణయాదవ్‌లతో మాట్లాడారు. పార్టీలో ఉండి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసే వారిని దూరంగా ఉంచాలంటూ మధు, అలీఖాన్‌పై భాస్కర్‌యాదవ్‌తో పాటు మరికొందరు వ్యాఖ్యానించారు.

తెలుగు తమ్ముళ్ల రచ్చ

తెలుగు తమ్ముళ్ల రచ్చ

దీనిపై అలీఖాన్‌ స్పందిస్తూ పనిచేసే వారికి పదవులు ఇవ్వడంలేదని అనడంతో.. విస్తృతస్థాయి సమావేశం వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టి పరువు తీస్తావా? అంటూ భాస్కర్‌యాదవ్‌ వర్గం మధు, అలీఖాన్‌లపై దాడికి యత్నించిన్నట్లు తెలిసింది.

తెలుగు తమ్ముళ్ల రచ్చ

తెలుగు తమ్ముళ్ల రచ్చ

దీంతో దెబ్బలు తిన్న మధు.. బాలసుబ్రహ్మణ్యంకు ఫోన్‌ చేసి తనపై దాడి చేశారని చెప్పడంతో.. బాలసుబ్రహ్మణ్యం తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు.

తెలుగు తమ్ముళ్ల రచ్చ

తెలుగు తమ్ముళ్ల రచ్చ

భాస్కర్‌, కృష్ణయాదవ్‌- బాలసుబ్రహ్మణ్యం, ఆయన అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులకు పాల్పడ్డారు.

తెలుగు తమ్ముళ్ల రచ్చ

తెలుగు తమ్ముళ్ల రచ్చ

నిన్నమొన్నటి వరకూ సమైక్యాంధ్ర ఉద్యమంలో చంద్రబాబును తిట్టి ఇప్పుడు అజమాయిషీ చేయాలని చూస్తున్నారా? అంటూ భాస్కర్‌యాదవ్‌ వర్గీయులు బాలసుబ్రహ్మణ్యంపై విరుచుకుపడ్డారు. దీంతో కాసేపు వాగ్వాదం, తోపులాటలు జరిగాయి. ఇంతలో కృష్ణయాదవ్‌, బాలసుబ్రహ్మణ్యంలు కట్టెలు తీసుకువచ్చారు.

తెలుగు తమ్ముళ్ల రచ్చ

తెలుగు తమ్ముళ్ల రచ్చ

కర్రలతో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. మీడియా ప్రతినిధులు ఉండగానే రెండు వర్గాలు బూతులు తిట్టుకుంటూ దాడులు చేసుకుని తోసుకున్నారు.

తెలుగు తమ్ముళ్ల రచ్చ

తెలుగు తమ్ముళ్ల రచ్చ

పరిస్థితి విషమించడంతో అక్కడే ఉన్న పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు వివాదాన్ని సద్దుమణిగేలా రెండు వర్గాల వారిని విడిపించారు. బాలసుబ్రహ్మణ్యం అక్కడి నుంచి నిష్క్రమించడంతో వివాదం సద్దుమణిగింది.

తెలుగు తమ్ముళ్ల రచ్చ

తెలుగు తమ్ముళ్ల రచ్చ

ఇంత జరుగుతున్నా సంఘటన స్థలంలో ఉన్న పోలీసులు కనీసం జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. విషయాన్ని రెండు వర్గాలు మంత్రి బొజ్జల దృష్టికి తీసుకువెళ్లాయి. దీనిపై ఇప్పుడు చర్చ వద్దని, మహానాడు పూర్తయ్యాక మాట్లాడుదామంటూ సర్దుబాటు చేసి పంపించేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.

English summary
TDP leaders fought at Mahanadu in Tirupati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X