కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఇలాకాకు 'కృష్ణా': గడ్డం తీయనని టిడిపి నేత సతీష్ శపథం

|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లా పులివెందులకు కృష్ణా జలాలు వచ్చేదాకా తాను గడ్డం తీసివేయనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి శపథం చేశారు. ఆదివారం నాడు ఆయనను వేంపల్లెలలో పార్టీ అనుచరులు కలిశారు.

పులివెందులకు కృష్ణా జలాల తరలింపు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా సతీశ్ రెడ్డి మాట్లాడారు. ఈ ఏడాది చివరి నాటికి పులివెందులకు కృష్ణా జలాలు తప్పకుండా వస్తాయన్నారు. పులివెందుల భూమిని కృష్ణా జలాలు ముద్దాడగానే తాను గడ్డం గీయించుకుంటానని చెప్పారు.

పులివెందులకు టిడిపి ప్రభుత్వం కృష్ణా జలాలు అందించి తీరుతుందన్నారు. కడప జిల్లాలోని ప్రాజెక్టులను నీటితో నింపేందుకు చంద్రబాబు చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. బ్రహ్మసాగర్‌కు పూర్తిస్థాయిలో నీటిని ఇస్తారని, సీబీఐర్‌కు కనీసం నాలుగు టీఎంసీల నీరు వస్తాయని, అలాగే గండికోటకు నీళ్లు తెప్పించి అక్కడి నుంచి పులివెందులకు తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

TDP leaders Sathish Reddy challenges over Krishna Water

ఈ ఏడాది వర్షాలు కూడా కరుణించాయన్నారు. రిజర్వాయర్‌లు నిండుగా ఉండటం మనకు అనుకూల పరిస్థితి ఏర్పడిందన్నారు. గండికోట ముంపువాసులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తుందని, ఆ నియోజకవర్గ నాయకులతో కలిసి ముంపు వాసులతో సమావేశం నిర్వహించటి సంతోషంగా వెళ్లేలా పరిహారం ఇప్పిస్తామన్నారు. కాగా, వైయస్ కుటుంబం ఇలాకా అయిన కడప జిల్లాపై టిడిపి ప్రత్యేకంగా కన్ను వేసిన విషయం తెలిసిందే.

అనంతపురంకు చంద్రబాబు వరాల జల్లు

స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు ఆదిత్యమిచ్చిన అనంతపురం జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఎన్టీఆర్ ఆశయం పేరుతో జిల్లా అభివృద్ధికి రూ.6554 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఎన్టీఆర్ ఆశయం పేరట ప్రకటించిన ఈ ప్యాకేజీ ప్రకటించారు.

English summary
TDP leaders Sathish Reddy challenges over Krishna Water for Kadapa district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X