వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద్యాలపై ప్రశ్నిస్తారా?: శిల్పా మోహన్ రెడ్డిపై టిడిపి కొత్త అస్త్రాలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి పట్టపగలు తిరగడం లేదని, అర్ధరాత్రుల్లు డబ్బు సంచులతో తిరుగుతున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి పట్టపగలు తిరగడం లేదని, అర్ధరాత్రుల్లు డబ్బు సంచులతో తిరుగుతున్నారని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఎద్దేవా చేశారు. నంద్యాల ప్రజల్ని కొనుగోలు చేస్తున్నారన్నారు.

భూమా ఫ్యామిలీపై జగన్ మామ తీవ్రవ్యాఖ్య, ఆది ఎఫెక్ట్.. కేశవరెడ్డిని లాగారుభూమా ఫ్యామిలీపై జగన్ మామ తీవ్రవ్యాఖ్య, ఆది ఎఫెక్ట్.. కేశవరెడ్డిని లాగారు

వైసిపి ఎందుకు అని ప్రశ్నిస్తోంది?

వైసిపి ఎందుకు అని ప్రశ్నిస్తోంది?

నంద్యాల నియోజకవర్గాన్ని నందనవనం చేస్తామని కాల్వ హామీ ఇచ్చారు. నంద్యాలలో తాము అభివృద్ధి పనులు చేస్తుంటే.. ఎందుకు చేస్తున్నారని వైసిపి ప్రశ్నిస్తుందని, ఇదేమిటని మండిపడ్డారు.

పదవులు ఇస్తే జగన్ పార్టీ నిలదీత

పదవులు ఇస్తే జగన్ పార్టీ నిలదీత

ఇక్కడి నాయకులకు పదవులు ఇస్తే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారని కాల్వ పేర్కొన్నారు. 1985లో మాజీ మంత్రి ఫరూక్‌ 32 ఏళ్ల వయస్సులోనే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారన్నారు. 1987లో డా నౌమన్‌ పురపాలక ఛైర్మన్‌గా ఎన్నికయ్యారన్నారు.

Recommended Video

Nandyal By-poll : Chandrababu Naidu Tense Over Elections | Oneindia Telugu
అప్పుడు శిల్పా ఎక్కడ?

అప్పుడు శిల్పా ఎక్కడ?

అప్పుడు శిల్పా మోహన్ రెడ్డి ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని కాల్వ అన్నారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ముస్లింకు గుర్తింపు వచ్చిందన్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాతనే సంక్షేమ కార్యక్రమాలు అమలు అయ్యాయన్నారు.

తెరపైకి కడప వాసి.. టిడిపి కొత్త అస్త్రం

తెరపైకి కడప వాసి.. టిడిపి కొత్త అస్త్రం

శిల్పా మోహన్‌రెడ్డి కడప జిల్లాకు చెందిన వారు అని, ఆయనకు నంద్యాలను అభివృద్ధి చేయడం ఏమాత్రం ఇష్టం లేదని టిడిపి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు అన్నారు. శిల్పా మోహన్ రెడ్డి ముస్లింలకు ఏం చేశారో తెలుసుకుని ఓట్లు వేయాలని మాజీ మంత్రి ఫరూక్ అన్నారు.

English summary
Telugu Desam Party leader Kalva Srinivasulu and Venkateswarlu said that YSR Congress Party Nandyal candidate Shilpa Mohan Reddy is from Kadapa district. They said Shilpa will not develop Nandyal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X