అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తలనొప్పి: అవే తప్పులు, బాబు ఆదేశాలు బేఖాతరు, మారేనా!

ఏపీలో టిడిపి నాయకల మధ్య సమన్వయం లేకుండా పోయింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ బహిరంగంగానే ఒకరిపై మరోకరు విమర్శలు చేస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీలో టిడిపి నాయకల మధ్య సమన్వయం లేకుండా పోయింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ బహిరంగంగానే ఒకరిపై మరోకరు విమర్శలు చేస్తున్నారు. అయితే పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది.అయితే కఠినంగా వ్యవహరిస్తే తప్ప పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశం లేకపోలేదని కొందరు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

చంద్రబాబుతో పవన్ మీటింగ్, కారణమిదే!చంద్రబాబుతో పవన్ మీటింగ్, కారణమిదే!

తెలుగుదేశం పార్టీలో ఇటీవల కాలంలో నేతల మధ్య సమన్వయం లేకపోవడం బహిరంగంగానే విమర్శలు చేయడం, ఆందోళనలకు దిగడం లాంటి ఘటనలు ఆ పార్టీని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అయితే క్రమశిక్షణను ఉల్లంఘించిన నేతలపై చర్యలపై పార్టీ నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.

హరికృష్ణకు చంద్రబాబు బంపర్ ఆఫర్: జూ.ఎన్టీఆర్ కోసమే?హరికృష్ణకు చంద్రబాబు బంపర్ ఆఫర్: జూ.ఎన్టీఆర్ కోసమే?

కొందరు నేతలు మాత్రం తమ పద్దతులను మార్చుకోవడం లేదు. దీంతో చంద్రబాబునాయుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి వైఖరిలో మార్పు రావడం లేదు. గతంలో మాదిరిగా క్రమశిక్షణ ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకొంటే పరిస్థితుల్లో మార్పులు వచ్చేవనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటనలపై పార్టీ ఏర్పాటుచేసిన కమిటీ సభ్యులు ఇంకా నివేదికలను సమర్పించని ఘటనలు కూడ ఉన్నాయి. మరికొన్ని జిల్లాల్లో కొందరు పార్టీ నేతలు తమ ఇష్టారీతిలో వ్యవహరించడాన్ని బాబు తప్పుబడుతున్నారు.అయితే క్రమశిక్షణను ఉల్లంఘించిన నేతలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ, ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.

కరణం బలరాం పై బాబు సీరియస్

కరణం బలరాం పై బాబు సీరియస్

ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో మాజీ మంత్రి కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రవి వైసీపీని వీడి టిడిపిలో చేరాడు. అయితే రవి టిడిపిలో చేరడాన్ని కరణం తీవ్రంగా వ్యతిరేకించాడు. అయినా పార్టీ అవసరాల రీత్యా రవిని టిడిపిలో చేర్చుకొన్నాడు. అయితే కరణం బలరాంకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాడు చంద్రబాబునాయుడు. అద్దంకి నియోజకవర్గంలో జోక్యం చేసుకోకూడదని బాబు కరణం బలరాంను ఆదేశించాడు. అయినా కరణం మాత్రం పట్టు వదలడం లేదు. ఇటీవల పోటాపోటీగా ఎమ్మెల్యే రవి, ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయులు శిలాఫలాకాలు ఏర్పాటుచేశారు. రవి వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడంపై కరణం వర్గీయులు మండిపడుతున్నారు. మూడు రోజుల క్రితం చోటుచేసుకొన్న ఘటనలపై కరణం మండిపడ్డారు. అయితే ఈ ఘటనలపై బాబు సీరియస్ అయ్యారు. జిల్లా ఇంచార్జీ మంత్రి నారాయణను ఈ విషయమై ఆయన వివరణ కోరారు. అద్దంకిలో జోక్యం చేసుకోకూడదని మరోసారి బలరాంకు బాబు ఆదేశాలు జారీ చేశారు.

జమ్మలమడుగులో తగ్గేనా

జమ్మలమడుగులో తగ్గేనా

కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల మధ్య ఆధిపత్యపోరు సాగుతోంది. ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలున్నాయి.అయితే ఈ నియోజకవర్గంలో కూడ రెండు గ్రూపులకు మధ్య పొసగడం లేదు. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న రామసుబ్బారెడ్డికి నాలుగురోజుల క్రితమే ఎమ్మెల్సీ పదవి దక్కింది. అయితే ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో కొనసాగిన గ్రూపుల గొడవ తగ్గుతోందా.. పెరుగుతోందా అనే చర్చ కూడ ఉంది. ప్రస్తుతం రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవి దక్కింది. ఇప్పటివరకు ఆయనకు ఏ పదవి లేదు.

పశ్చిమలో కొరవడిన సమన్వయం

పశ్చిమలో కొరవడిన సమన్వయం

పశ్చిమగోదావరి జిల్లాల్లో నేతల మధ్య సమన్వయం కొరవడింది. తాడేపల్లి‌గూడెంలో మంత్రి మాణిక్యాలరావుకు టిడిపి నేతలకు మధ్య సమన్వయం లేదు. పార్టీలో రెండు మూడు గ్రూపులున్నాయి. అయితే ఈ గ్రూపుల మధ్య కూడ సమన్వయం లేదు. చింతలపూడి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పార్టీలోని మరో గ్రూప్ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఉత్తరాంధ్రలో బహిరంగ రహస్యమే

ఉత్తరాంధ్రలో బహిరంగ రహస్యమే

ఉత్తరాంద్రలో పార్టీ నేతలు బహరంగంగానే విమర్శలు చేసుకొనే పరిస్థితి నెలకొంది. విశాఖలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడుకు మద్య తీవ్ర విబేధాలున్నాయి. విశాఖ భూ స్కామ్‌కు సంబంధించి మంత్రి గంటాపై అయ్యన్న పరోక్షంగా ఆరోపణలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యే శివాజీ తనకు వ్యతిరేకంగా ఉన్నారనే ఆరోపణలతో మున్సిఫల్ చైర్మెన్‌పై సస్సెన్షన్ వేటు విధించారనే ఆరోపణలు ఉన్నాయి.

అనంతలోనూ అంతే

అనంతలోనూ అంతే

అనంతలో పరిటాల సునీత వర్గీయులకు వరదాపురం సూరి వర్గీయులకు మధ్య గతంలో గొడవలు జరిగాయి. మరో వైపు తాడిపత్రిలో ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డిపై స్వంత పార్టీకి చెందిన కౌన్సిలర్ ఆరోపనలు చేశారు. దీంతో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. హిందూపురంలో బాలకృష్ణ పిఏ వ్యవహరశైలిని నిరసిస్తూ పార్టీ నాయకులు రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు. అయితే దీంతో ఆయన పీఏను మార్చాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.అయితే క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే పరిస్థితుల్లో మార్పులు రాకపోవచ్చని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

English summary
Tdp leaders violated party discipline in various districts. Tdp chief Chandrababu naidu warned many times but they cross the limits. Now babu focusing on discipline in party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X