వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్‌కు కార్యకర్త సూటి ప్రశ్న!: ఎందుకలా జరుగుతోందని నిలదీత?

కార్యకర్త తన ఆవేదనను పూర్తిగా వినిపించకుండానే లోకేష్ సిబ్బంధి ఆయన్ను మధ్యలోనే అడ్డుకున్నారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: పార్టీ కోసం కష్టపడుతున్న వారిని టీడీపీ అధిష్టానం గుర్తించట్లేదని ఓ కార్యకర్త మంత్రి లోకేష్ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ లోకేష్ మాత్రం ఆయన అభిప్రాయాన్ని తప్పుపట్టారు. మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని కార్యకర్తల అభిప్రాయంగా చెప్పవద్దని సూచించారు.

విజయవాడలో పంచాయితీరాజ్ 40వ వార్షికోత్సవం నిర్వహించిన సందర్భంగా మంత్రి లోకేష్‌కు ఈ ప్రశ్న ఎదురైంది. సమావేశంలో పాల్గొన్న గొమ్ములూరుకు చెందిన ఓ టీడీపీ కార్యకర్త ఈ ప్రశ్న లేవనెత్తాడు. దీంతో షాక్ తిన్న లోకేష్.. పార్టీలో కష్టపడుతున్నవారికి న్యాయం జరగడం లేదని చెప్పడం సరికాదన్నారు.

tdp member questions minister lokesh over neglecting party cadre

కార్యకర్త తన ఆవేదనను పూర్తిగా వినిపించకుండానే లోకేష్ సిబ్బంధి ఆయన్ను మధ్యలోనే అడ్డుకున్నారు. సదరు కార్యకర్త మాత్రం టీడీపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. కార్యకర్తలకు న్యాయం జరగడం లేదని గతంలో నాలుగుసార్లు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు గుర్తుచేశాడు. అయినా సరే ఎవరూ పట్టించుకోలేదన్నారు.

కార్యకర్త నిర్ణయాన్ని తప్పుపట్టిన లోకేష్.. నామినేటెడ్ పదవుల విషయంలో కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటున్నామని, ఐవీఆర్ఎస్ పదవులు కూడా భర్తీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

English summary
A Telugu Desam party activist was raised a question infront Minister Nara Lokesh regarding party cadre. He alleged that party high command was not caring them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X