వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'చిన్నప్పుడే జగన్ బాంబులేసే ప్రయత్నం, అసెంబ్లీకి తుపాకీ తీసుకెళ్లి కాల్చుతాడేమో'

వైసిపి అధినేత వైయస్ జగన్ చిన్నప్పుడే దివంగత పరిటాల రవిపై బాంబులు వేసేందుకు ప్రయత్నించారని టిడిపి నేత కళా వెంకట్రావు ఆరోపించారు. నరమేధంతో జగన్ ప్రజాస్వామ్యాన్ని నడపాలనుకుంటున్నారన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసిపి అధినేత వైయస్ జగన్ చిన్నప్పుడే దివంగత పరిటాల రవిపై బాంబులు వేసేందుకు ప్రయత్నించారని టిడిపి నేత కళా వెంకట్రావు ఆరోపించారు. నరమేధంతో జగన్ ప్రజాస్వామ్యాన్ని నడపాలనుకుంటున్నారన్నారు.

రోజా! నీ క్యారెక్టర్ ఏంటి?: టిడిపి ఎమ్మెల్సీ, వస్త్రధారణపై అఖిలప్రియరోజా! నీ క్యారెక్టర్ ఏంటి?: టిడిపి ఎమ్మెల్సీ, వస్త్రధారణపై అఖిలప్రియ

తండ్రి నీడలోనే జగన్ ఆర్థిక నేరస్తుడిగా ఎదిగాడని ద్వజమెత్తారు. నడిరోడ్డుపై చంద్రబాబును కాల్చాలన్న జగన్ రాజకీయ నాయకుడా అని విమర్శించారు. జగన్ వాడిన పదజాలానికి ఆయన కుటుంబ నేపథ్యం ఒక కారణమై ఉంటుందన్నారు.

జగన్‌పై కోడెల పరోక్షంగా

జగన్‌పై కోడెల పరోక్షంగా

ప్రజలు తెలివైనవారని, నాయకుడి ప్రవర్తన మంచిదైతే చెప్పేమాట, చేసేపని సరిగా ఉంటే వింటారని, మైకు దొరికిందని బాధ్యత మరచి మాట్లాడితే ప్రజాకోర్టులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పీకర్ కోడెల శివప్రసాద రావు అన్నారు. సీఎంపై జగన్‌ అనుచిత వ్యాఖ్యలను ఉద్దేశించి ఆయన పరోక్షంగా మాట్లాడారు. అధికారం, ప్రతిపక్షంలో ఎక్కడున్నా నాయకులు బాధ్యతగా మాట్లాడాలన్నారు.

Recommended Video

MLA Roja and YS Jagan Got Insulted by TDP Govt - Oneindia Telugu
జగన్‌కి అధికారం అప్పగిస్తే

జగన్‌కి అధికారం అప్పగిస్తే

ఏమవుతుందో ప్రజలు ఆలోచించాలని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఐదేళ్లలో దోచుకునే అవకాశం పోయిందనే కడుపు మంట, అధికార దాహంతో చేస్తున్న వ్యాఖ్యల్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.

అసెంబ్లీలోకి తుపాకీ తీసుకెళ్లి ఆ పని చేసినా చేస్తాడు

అసెంబ్లీలోకి తుపాకీ తీసుకెళ్లి ఆ పని చేసినా చేస్తాడు

రాష్ట్ర వికలాంగుల సంక్షేమ సంఘం ఛైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వర రావు మాట్లాడుతూ.. సీఎంను కాల్చాలని బహిరంగంగా చెబుతున్న జగన్‌ నిజంగా అసెంబ్లీలోకి తుపాకీ తీసుకెళ్లి ఆ పనిని చేయనైనా చేస్తాడన్నారు. ముందు జాగ్రత్తగా ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేలా సభాపతి చర్యలు తీసుకోవాలన్నారు.

విశాఖ మెంటల్ ఆసుపత్రిలో చేరాలి

విశాఖ మెంటల్ ఆసుపత్రిలో చేరాలి

మానసికస్థితి బాగాలేని జగన్‌ విశాఖ మానసిక ఆసుపత్రిలో చేరితే మంచిదని మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. వైయస్ వంశానికి నేరపూరిత చరిత్ర ఉందని అది జగన్‌లో జీర్ణించుకు పోయిందన్నారు. పార్టీ ఫిరాయింపులను మొదలుపెట్టింది వైఎస్‌ రాజశేఖరరెడ్డేనని మంత్రి గంటా పేర్కొన్నారు.

ఇంత నీచుడిని చూడలేదు

ఇంత నీచుడిని చూడలేదు

వైయస్ జగన్ లాంటి నీచుడిని చూడలేదని ఎమ్మెల్యే యరపతినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదుటి నాయకుడు చనిపోతే పదవి పొందాలనుకునే వాడు నాయకుడే కాదన్నారు. నంద్యాలలో టిడిపి విజయం ఖాయమని చెప్పారు.

English summary
Telugu Desam Party leaders and Ministers hit out at YSR Congress Party chief YS Jaganmonahan Reddy for his comments in Nandyal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X