విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పూరీలో పురుగులు: ఆ ఫుడ్ చూసి షాక్ తిన్న టీడీపీ ఎమ్మెల్యే, హోటల్‌పై ఫిర్యాదు

ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ నిమిత్తం విజయవాడలోని మినర్వా గ్రాండ్ హోటల్ కు వెళ్లారాయన.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: చిన్న హోటల్స్ అయితే శుచీశుభ్రత విషయంలో అంతగా జాగ్రత్తలు పాటించరని.. చాలామంది లగ్జరీ హోటల్స్ లో భోజనం చేయడానికే మొగ్గుచూపుతుంటారు. కానీ లగ్జరీ హోటల్స్ లోను క్వాలిటీకి గ్యారెంటీ లేదని ఇటీవలి పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

తాజాగా ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మంగళవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ నిమిత్తం విజయవాడలోని మినర్వా గ్రాండ్ హోటల్ కు వెళ్లారాయన. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్డర్ చేసిన టిఫిన్ లో కొన్ని పురుగులు రావడం కలకలం రేపింది. పూరీలో పురుగులు వచ్చిన విషయాన్ని యాజమాన్యానికి చెప్పినా.. వారు స్పందించకపోవడంతో ఫుడ్ కంట్రోల్ అధికారులకు ఆయన ఫిర్యాదు చేశారు.

tdp mla bollineni ramarao complaint on minerva grand hotel

ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ఫుడ్ కంట్రోల్ అధికారులు.. మినర్వా హోటల్‌పై దాడులు జరిపారు. హోటల్లోని అన్ని ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించి టెస్టుల కోసం ల్యాబ్‌కు పంపించారు. స్వయంగా తానే హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని అధికారులకు ఎమ్మెల్యే చెప్పారు. ఫుడ్ శాంపిల్స్ రిపోర్టులో తేలే అంశాలను బట్టి మినర్వా హోటల్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

English summary
Udayagiri TDP MLA Bollineni Ramarao was complainted to food controll officials on Minerva grand hotel, Vijayawada for supplying quality less food.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X