విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే బొండా తనయుడు అరెస్ట్, కోర్టులో హాజరు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

TDP mla Bonda Umamaheswara Rao son arrested
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో కార్ రేసింగ్‌కు పాల్పడి ఓ వ్యక్తి మరణానికి కారకుడయ్యాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధిక్, అతని స్నేహితుడు జై శివరాంను పోలీసులు అరెస్టు చేశారు.

నిందితులను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచారు. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద జరిగిన కారు రేసింగ్‌లో ఓ వ్యక్తి మృతి చెందిన సంగతి తెలిసిందే. అనంతరం సిద్దిక్ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు మీడియాలో వార్తలు ప్రసారమయ్యాయి.

ఈ నేపథ్యంలో సిద్దిక్‌ను పోలీసులు అతనిని అరెస్టు చేసి చిలకలూరిపేట న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విచారించిన కోర్టు సిద్దార్ద్‌కు 5000 జరిమానా విధించి, ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ మంజారు చేశారు. 304 (ఎ), 337 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు యడ్లపాడు పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో సిద్దిక్‌ను పోలీసులు అతనిని అరెస్టు చేసి చిలకలూరిపేట న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. 304 (ఎ), 337 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు యడ్లపాడు పోలీసులు తెలిపారు. జయవాడ కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పది మంది విద్యార్థులు రెండు కార్లలో ఆదివారం చిలకలూరిపేటకు వస్తుండగా ఈ ఘటన జరిగింది.

అత్యంత వేగంగా రెండు కార్లు పక్కపక్కనే వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ కారు అదుపుతప్పి రెండో కారును ఢీ కొంది. దీంతో అవి పల్టీలు కొడుతూ వెళ్లి ఒకటి హైవే అంచున బోర్లాపడగా, రెండోది పక్కనే ఉన్న కాలువలోకి దూసుకువెళ్లింది. కార్లు పల్టీలు కొట్టే సమయంలోనే అందులో ఉన్న నాగేంద్ర(22) జాతీయ రహదారిపై పడి మృతిచెందాడు.

పోలీసుల వేధింపులకు యువకుడి ఆత్మహత్య

గుంటూరు జిల్లాలోని నల్లచెరువు జీరో లైన్‌లో పోలీసుల వేధింపులు తాళలేక బాషా అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్‌ బాలుడిని కిడ్నాప్‌ చేశారంటూ మూడు రోజుల క్రితం లాలాపేట పోలీసులు బాషాను అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేశారు. దీంతో మనస్థాపం చెందిన బాషా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల కారణంగానే బాషా ఆత్మహత్య చేసుకున్నాడంటూ బంధువులు ఆందోళన దిగారు.

English summary
A case was filed against Bonda Uma Maheswara Rao's son Siddharth along with 7 others. The legislator told that his son was on his way to some private programme when the accident happened.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X