వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపికి బిజెపి షాక్: ఆ షరతుతోనే ప్రచారానికి కమల నేతలు, టిడిపికి దెబ్బే!

నంద్యాల అసెంబ్లీ స్థానంలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డికి మద్దతివ్వాలని బిజెపి నిర్ణయం తీసుకొంది. అయితే బిజెపి మద్దతు తమ కొంపముంచే అవకాశం ఉందని టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానంలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డికి మద్దతివ్వాలని బిజెపి నిర్ణయం తీసుకొంది. అయితే బిజెపి మద్దతు తమ కొంపముంచే అవకాశం ఉందని టిడిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. ప్రచారానికి వస్తే కండువాలు, పార్టీ జెండాలు లేకుండానే రావాలని టిడిపి నేతలు బిజెపికి సూచిస్తున్నారు. తమ పార్టీ కండువాలు, జెండాలు లేకుండా ప్రచారానికి వచ్చే ప్రసక్తే లేదని బిజెపి నేతలు తేల్చి చెప్పారు. బిజెపి నేతలు ప్రచారానికి వస్తే పలితం తారుమారయ్యే అవకాశం ఉందని టిడిపి నేతలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

'శిల్పా' రాజీనామా ఆమోదం, టిడిపికి దెబ్బేనా?'శిల్పా' రాజీనామా ఆమోదం, టిడిపికి దెబ్బేనా?

2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిడిపి, బిజెపిలు కూటమిగా పోటీచేశాయి. కేంద్రంలో టిడిపి, ఏపీ రాష్ట్రంలో బిజెపి చేరింది. రెండు పార్టీలు ఇప్పటివరకు మిత్రపక్షంగానే కొనసాగుతున్నాయి. 2019 ఎన్నికల వరకు కూడ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు.

రంగంలోకి ఆదిశేషగిరిరావు: 'శిల్పా'కు మహేష్‌బాబు అభిమానుల మద్దతు, 'పవన్' మద్దతెవరికీ?రంగంలోకి ఆదిశేషగిరిరావు: 'శిల్పా'కు మహేష్‌బాబు అభిమానుల మద్దతు, 'పవన్' మద్దతెవరికీ?

2019 ఎన్నికల సమయంలో టిడిపితో పొత్తు విషయంలో బిజెపి ఏ నిర్ణయం తీసుకొంటుందో ఇప్పటికిప్పుడే చెప్పలేం. అయితే ప్రస్తుతం జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నికల్లో మిత్రపక్షంగా ఉన్నందున టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డికి మద్దతిస్తున్నట్టు బిజెపి ప్రకటించింది.

'మా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు, పవన్‌కళ్యాణ్ మద్దతు మాకే''మా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు, పవన్‌కళ్యాణ్ మద్దతు మాకే'

బిజెపి మద్దతు ఇవ్వడానికి టిడిపి నేతలు అభ్యంతరం చెప్పడం లేదు. ప్రచారానికి వచ్చే సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. పార్టీ జెండాలు, కండువాలు, గుర్తులు లేకుండానే వచ్చి టిడిపి అభ్యర్థి బ్రహ్మనందరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించాలని కోరుతున్నారు.

బిజెపి ప్రచారం కొంపముంచేనా?

బిజెపి ప్రచారం కొంపముంచేనా?

నంద్యాలలో ప్రధానంగా ముస్లిం మైనార్టీల ఓట్లు గెలుపు ఓటములపై తీవ్రంగా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ ఉపఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డికి బిజెపి మద్దతును ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో సుమారు 55వేల ఓట్లు ముస్లిం మైనారిటీలకు ఉన్నాయి. బిజెపి నేతలు కండువాలు, జెండాలతో వచ్చి టిడిపికి అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తే తమ కొంపమునిగే అవకాశం ఉందని టిడిపి నేతలు అనుమానిస్తున్నారు. బిజెపి సానుభూతిపరులు, క్యాడర్ ఉన్న చోట జెండాలు, కండువాలు, గుర్తులు లేకుండా వచ్చి ప్రచారం చేయాలని బిజెపి నేతలకు టిడిపి నాయకులు సూచించారు. అయితే ఈ ప్రతిపాదనను బిజెపి నేతలు తిరస్కరించారు.

Recommended Video

Mahesh fans Support To YSRCP in Nandyal By polls, What About Pawan Kalyan | Oneindia Telugu
మంత్రి మాణిక్యాలరావు, మాధవ్‌కు బాధ్యతల అప్పగింత

మంత్రి మాణిక్యాలరావు, మాధవ్‌కు బాధ్యతల అప్పగింత

నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డికి మద్దతుగా ప్రచారం చేసే విషయమై టిడిపి అభ్యంతరాలపై చర్చించే బాధ్యతలను మంత్రి మాణిక్యాలరావుకు, ఎమ్మెల్సీ మాధవ్‌కు పార్టీ అప్పగించింది. రాష్ట్ర కమిటీ ఇప్పటికే టిడిపి అభ్యంతరాలను వీరిద్దరి దృష్టికి తెచ్చింది. అయితే ఈ సమయంలో టిడిపి నేతలతో ఈ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

టిడిపి ఆహ్వనిస్తే ప్రచారానికి వెళ్ళాల్సిందే

టిడిపి ఆహ్వనిస్తే ప్రచారానికి వెళ్ళాల్సిందే

నంద్యాలలో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డికి మద్దతుగా ప్రచారం చేయాలని టిడిపి నాయకత్వం నుండి పిలుపు వస్తే తప్పనిసరిగా వెళ్ళాల్సిందేనని బిజెపి రాష్ట్ర కమిటీ కర్నూల్ బిజెపి నేతలకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. టిడిపితో సమన్వయం చేసుకొనేందుకు కూడ కమిటీని నియమించనున్నారు. ఎన్‌డిఏలో టిడిపి ప్రధాన భాగస్వామ్య పార్టీ అనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు బిజెపి నేతలు.

సున్నితమైన అంశం

సున్నితమైన అంశం

నంద్యాలలో గెలుపు ఓటములపై ముస్లిం ఓటర్లు ప్రభావం చూపే అవకాశం ఉన్నందున బిజెపి నేతలు ప్రచారం చేస్తే లాభం కంటే నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని టిడిపి నేతలు భావిస్తున్నారు.నంద్యాల పట్టణంలోని ముస్లిం మైనారిటీ నేతలను టిడిపి తనవైపుకు ఆకర్షిస్తోంది. ఈ తరుణంలోనే బిజెపి నేతలు ప్రచారంలోకి వస్తే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ విషయమై అంతర్గతంగానే ప్రచారం నిర్వహిస్తేనే ప్రయోజనమని టిడిపి నేతలు బిజెపికి సూచిస్తున్నారని సమాచారం.

English summary
Without Party symbols and badges come to conduct campaign for Bhuma Brahmananda reddy Tdp leaders requested to Bjp leaders. Bjp leaders refused this request.Bjp senior leaders discussing with this issue to Tdp state leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X