వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసిపిలో సగం వాళ్లే: జగన్‌కు 'లిక్కర్' షాక్, ఇంగ్లాండ్‌లోని బిగ్గెస్ట్ పోటీ కంటే...

ప్లీనరీలో ఇచ్చిన హామీలు, టిడిపిపై వైసిపి నేతలు చేసిన విమర్శలకు అధికార పార్టీ నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. మూడు దశల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన జగన్‌పై టిడిపి నేతలు భగ్గుమన్నారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్లీనరీలో ఇచ్చిన హామీలు, టిడిపిపై వైసిపి నేతలు చేసిన విమర్శలకు అధికార పార్టీ నేతలు ధీటుగా స్పందిస్తున్నారు. మూడు దశల్లో మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పిన జగన్‌పై టిడిపి నేతలు భగ్గుమన్నారు.

<strong>ప్రశాంత్ సలహానా.. హద్దుదాటిన షర్మిల, నాని!: నాలుక కోస్తామని అవినాష్ వార్నింగ్</strong>ప్రశాంత్ సలహానా.. హద్దుదాటిన షర్మిల, నాని!: నాలుక కోస్తామని అవినాష్ వార్నింగ్

రాష్ట్రంలో 75 శాతం మద్యం వ్యాపారులు వైసిపికి చెందిన వారేనని టిడిపి నేతలు విమర్శించారు. మద్య నిషేధంపై మాట్లాడే ముందు జగన్‌ తన పార్టీ వారిచే వ్యాపారం నుంచి మాన్పించాలని హితవు పలికారు.

మంత్రులు పరిటాల సునీత, నారా లోకేష్, పత్తిపాటి పుల్లారావు, టిడిపి నేతలు డొక్కా మాణిక్యవర ప్రసాద్ తదితరులు వైసిపిపై నిప్పులు చెరిగారు.

<strong>ప్రశాంత్ కిషోర్ గెలిపిస్తాడట: జగన్‌పై బాబు, రాజధాని తరలింపుపై అనుమానాలు?</strong>ప్రశాంత్ కిషోర్ గెలిపిస్తాడట: జగన్‌పై బాబు, రాజధాని తరలింపుపై అనుమానాలు?

మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రతిపక్షనేతగానే విఫలమైన జగన్‌ ముఖ్యమంత్రి కావాలని కలలుగనడం విడ్డూరమన్నారు. బడ్జెట్‌కు మించి అవినీతి జరిగిందని విమర్శిస్తున్న ప్రతిపక్ష నాయకుడికి ఉన్న అవగాహన ఏ పాటో ఆయన విమర్శల్లోనే అర్థమవుతోందన్నారు.

ప్లీనరీలో సగం మంది మద్యం తాగేవారే

ప్లీనరీలో సగం మంది మద్యం తాగేవారే

జగన్‌ పాదయాత్ర ప్రారంభించే స్థానం ఇడుపులపాయ కాదని అది ముడుపులపాయ అని మరో మంత్రి జవహర్‌ విమర్శించారు. జగన్ జైలు కెళ్లడం ఖాయమని, ప్రశాంత్‌ కిషోర్‌ ఆ పార్టీకి అధ్యక్షుడవుతారన్నారు. వైసిపి ప్లీనరీలో పాల్గొన్న సగం మంది మద్యం సేవిస్తారని, వారు మానేస్తే ఖర్చు తగ్గుతుందని ఆ పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎవరి శరీరంలో ఎంత ఆల్కహాల్‌ శాతం ఉందో తెలుసుకోవడానికి తాను సిద్ధమని సవాల్ విసిరారు.

కిరాయి వ్యక్తులను తెచ్చుకున్నా..

కిరాయి వ్యక్తులను తెచ్చుకున్నా..

వైసిపిలో ఉన్న నాయకులెవరూ పార్టీని బతికించలేరని, గత్యంతరం లేక ప్రశాంత్‌ కిషోర్‌‌ను జగన్‌ అరువు తెచ్చుకున్నారని డొక్కా మాణిక్యవర ప్రసాద్‌ అన్నారు. కిరాయి వ్యక్తులు ఎంతమంది వచ్చినా సీఎంపై ఉన్న ప్రజాభిమానాన్ని ఏమీ చేయలేరన్నారు.

అదో బూతుల ప్లీనరీ

అదో బూతుల ప్లీనరీ

కాశీ వరకు పాదయాత్ర చేపట్టినా జగన్‌ తన పాపాలను ప్రక్షాళన చేసుకోలేరని మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. రాజధాని నిర్మాణంలో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్న జగన్ నిరూపించాలన్నారు. జగన్‌ జీవితంలో ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేరన్నారు. వైసిపి ప్లీనరీ... బూతుల ప్లీనరీగా ఉందని ఎద్దేవా చేశారు.

ఇంగ్లాండ్‌లోని పోటీ కంటే పెద్దగా...

ఇంగ్లాండ్‌లోని పోటీ కంటే పెద్దగా...

ప్రతి సంవత్సరం ఇంగ్లండ్‌లో వరల్డ్‌ బిగ్గెస్టు లయ్యర్‌ పోటీ జరుగుతుందని, వైసిపి ప్లీనరీ దానికి తలదన్నేలా ఉందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దుమ్మెత్తిపోశారు. మధురవాడ తారకరామ లే అవుట్‌లో వైయస్ హయాంలో ఇచ్చిన 13 వేల ఎకరాల్లో ఏం జరిగిందో సిట్‌ దర్యాప్తులో బయటపడుతుందన్నారు. వైవీ సుబ్బారెడ్డి ఇందులో రూ.600 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డ వైనమూ తేలుతుందన్నారు.

English summary
Telugu Desam Party gave shock to YSRCP chief YS Jaganmohan Reddy on liquor ban promise in YSRCP plenary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X