వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కడప:స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు, జగన్ పార్టీల ఎత్తులు

ఈ నెల 17వ, తేదిన జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందకుగాను టిడిపి తన శక్తియుక్తులను ప్రదర్శిస్తోంది. అయితే వైసిపి కూడ తన పట్టును నిలుపుకొనేందుకు గాను వైసిపి ప్రయత్నిస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కడప:ఈ నెల 17వ, తేదిన జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను టిడిపి తన శక్తియుక్తులను ప్రదర్శిస్తోంది.అయితే వైసిపి మాత్రం తన పట్టును నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది.అయితే టిడిపికి చెందిన ప్రజా ప్రతినిధులతో పుదుచ్చేరిలో ఆ పార్టీ నాయకులు క్యాంప్ నిర్వహిస్తున్నారు.

ఈ నెల 17వ, తేదిన కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను అన్ని రకాల వ్యూహలను టిడిపి అనుసరిస్తోంది. వైసిపి మాత్రం తన పట్టును నిలుపుకొనేందుకు వైసిపి కూడ ప్రయత్నాలు చేస్తోంది.

కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్షపార్టీలు ఎత్తులు వేస్తున్నాయి.

కడప జిల్లాలో వైసిపికి కంచుకొట.అయితే వైసిపి నుండి ఎమ్మెల్యేలు, నాయకుల ఫిరాయింపుల కారణంగా ఆ పార్టీ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. వైసిపితో ఢీ అంటే ఢీ అనే పరిస్థితిలో టిడిపి చేరింది.అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న టిడిపి,వైసిపి

ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న టిడిపి,వైసిపి

కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను అదికార టిడిపి, విపక్ష వైసిపిలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.ఈ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ రెండు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.ఈ నెల 17వ, తేదిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.అయితే తమ వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులతో టిడిపి పుదుచ్చేరిలో క్యాంపు నిర్వహిస్తోంది.క్యాంపు నుండి సరాసరి ఓటింగ్ లో పాల్గొనేందుకు రానున్నారు టిడిపికి ఓటేసే ప్రజాప్రతినిధులు.

క్రాస్ ఓటింగ భయం కొంప ముంచేనా?

క్రాస్ ఓటింగ భయం కొంప ముంచేనా?

కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి నాయకులు తమకు మద్దతిచ్చే ప్రజాప్రతినిధులతో ఏకంగా బలప్రదర్శన చేశారు. తమ వర్గీయులతో కలిసి క్యాంపులో ఉంటున్నారు.అయితే మరోవైపు ఎన్నికల రోజున క్రాస్ ఓటింగ్ తమ కొంపముంచే అవకాశం లేకపోలేదనే భయం కూడ టిడిపి నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అయితే వాస్తవానికి కడప జిల్లాలో టిడిపి బలం నామమాత్రమే.అయితే ఫిరాయింపుల ద్వారా ఆ పార్టీ బలం పెరిగింది. తమకు 458 మంది సభ్యుల బలం ఉందని ఆ పార్టీ ప్రకటించింది.అయితే కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకొంటామని ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు బాబు వద్ద ప్రస్తావించిన సమయంలో గెలిచి రావాలని ఆయన సూచించాడు.

 ఫిరాయింపులతో బలం తగ్గిన వైసిపి

ఫిరాయింపులతో బలం తగ్గిన వైసిపి

కడప జిల్లాలో ఐదువందలకు పైగా ప్రజా ప్రతినిధులు స్థానిక సంస్థల్లో ఉన్నారు.అయితే ఫిరాయింపుల ద్వారా ఆ పార్టీ బలం గణనీయంగా తగ్గిపోయింది. ఈ మేరకు టిడిపి నాయకులు వైసిపి నుండి స్థానిక సంస్థల్లో విజయం సాధించిన వారిని తమ పార్టీలోకి ఫిరాయించేలా చేశారని వైసిపి ఆరోపిస్తోంది.ఈ కారణాలతో వైసిపి బలం గణనీయంగా తగ్గిపోయిందని టిడిపి అభిప్రాయపడుతోంది.ఈ కారణంగానే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని టిడిపి నాయకులు ధీమాతో ఉన్నారు.

టిడిపి, వైసిపి ల వ్యూహలు

టిడిపి, వైసిపి ల వ్యూహలు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను అధికార, విపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ మేరకు రెండు పార్టీలు తమ పట్టును కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాయి. వైసిపి తనకు మద్దతిచ్చే ప్రజా ప్రతినిధులతో బెంగుళూరు, గోవాలో క్యాంపులు నిర్వహిస్తోంది.టిడిపి నాయకులు పుదుచ్చేురిలో క్యాంపులు నిర్వహిస్తున్నారు.రాజ్యసభ సభ్యుడు టిడిపి నేత సిఎం రమేష్ టిడిపి అభ్యర్థి బిటెక్ రవి విజయాన్ని తన భుజాలపై వేసుకొన్నారు. మరో వైపు వైసిపి అధినేత చిన్నాన్న వివేకానందరెడ్డి గెలుపు కోసం వైసిపి నాయకులు కూడ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

English summary
tdp strength in local bodies elected representatives increased 458. tdp strategy for mlc elections in kadapa.ysrcp plan to win this elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X