నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నెల్లూరు నగరంలోని 54వ డివిజన్‌లో జరిగిన జన్మభూమి సభలో ఎమ్మెల్యే, మేయర్‌కు పార్టీలకు సంబంధిన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురంలో జరిగిన ఈ సభకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌‌తో పాటు మేయర్ అబ్దుల్ అజీజ్, తెలుగుదేశం పార్టీ నాయకులు హాజరయ్యారు.

ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సభలో ప్రసంగిస్తూ తాను వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ మోహాన్ రెడ్డికి విధేయుడిగా పని చేస్తున్నానని, కొందరు మాత్రం వైఎస్ఆర్‌సీపీ తరుపున పదవులు పొంది పార్టీలు మారారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో సభలో గందరగోళం ఏర్పడింది.

TDP and YSRCP activists clash in Nellore

దీంతో మేయర్ అబ్దుల్ అజీజ్ వర్గీయులు, ఎమ్మెల్యే వర్గీయులతో వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా పరిస్ధితి ఉద్రిక్తంగా మారి రెండు వర్గాల మధ్య తీవ్ర స్ధాయిలో తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్ధితులు సద్దుమణిగేలా చూశారు.

తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను జరుగుతున్న పరిస్ధితినే చెప్పానని, ఎవరినీ విమర్శించలేదని అన్నారు. తాను గొడవ పడడానికి రాలేదని, వస్తే పరిస్ధితి మరోలా ఉండదేని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.

English summary
TDP and YSRCP activists clash in Nellore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X