వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బకాయిలు చెల్లించండి: అరుణ్ జైట్లీతో తెలంగాణ సిఎం కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. శనివారం ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. తెలంగాణకు రావాల్సిన బకాయిలు, సీఎస్టీ నిధులు చెల్లించాలని అరుణ్‌జైట్లీని సీఎం కేసీఆర్‌ కోరారని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు వినోద్‌ కుమార్ తెలిపారు.

కేంద్రం ప్రకటించిన టెక్స్‌టైల్‌ పార్కులకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కోరామని వినోద్‌ చెప్పారు. రాష్ర్టానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీతో ప్రస్తావించారని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ తెలిపారు. ఇవాళ సీఎంతోపాటు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఆయన ఉన్నారు. భేటీ అనంతరం వినోద్ కుమార్ మీడియాకు వివరాలను అందించారు.

 Telangana CM KCR meets Arun jaitley

బకాయిలను మూడేళ్లలో చెల్లిస్తామని జైట్లీ తెలిపారు. హెచ్‌ఎండీఏ హౌసింగ్ బోర్డు పన్నులను మాఫీ చేయాలని సీఎం కోరారు. టెక్స్‌టైల్స్ క్లస్టర్స్ కోసం బడ్జెట్‌లో నిధులను కేటాయించాని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ర్టాల మధ్య సంబంధాలు బాగుండేలా కొత్త ఒరవడితో బడ్జెట్ ఉంటుందని ఆరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. రా

ష్ర్టాలు కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా ప్రధాన మంత్రి జీఎస్‌టీ విధానం తెస్తున్నారని, జీఎస్‌టీ ద్వారా లబ్ది పొందే రాష్ర్టాల్లో తెలంగాణ కూడా ఉంటుదని జైట్లీ తెలిపారని వినోద్ వివరించారు. కెసిఆర్ శుక్రవారంనాడు కూడా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి కావాల్సిన విషయాలపై ఆయన వారితో మాట్లాడారు. కేంద్ర మంత్రులతో ఇంత విస్తృతంగా కెసిఆర్ సమావేశం కావడం ఇదే తొలిసారి. గతంలో కలిసినప్పటికీ ఇంత విస్తృతంగా చర్చలు జరపలేదు.

English summary
Telangana CM K Chandrasekhar rao has met union finance minister Arun Jaitley in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X