వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లేస్ ఆఫ్ బర్త్: ఏపీ విద్యార్థులకు తెలంగాణలో కొత్త పరీక్ష!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వెబ్‌సైట్లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ సిస్టంను పెట్టింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి, తెలంగాణ వారిగా ఉంటున్న విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఆర్టికల్ 371(డి) ప్రకారం ఏపీలో పుట్టిన వారు.. ఐదేళ్లు తెలంగాణలో చదివినా లేక ఏడేళ్లు నివసించినా తెలంగాణవారిగా ఉంటారు. అయితే, ఇప్పుడు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఏపీ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు.

Telangana has a new test for ‘non-locals’

ఈ రిజిస్ట్రేషన్లో ప్లేస్ ఆఫ్ బర్త్ (పుట్టిన స్థలం), జిల్లా, రాష్ట్రంను పేర్కొనాలని ఉంది. ఆప్షన్స్‌లలో తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలు ఉన్నాయి. పదకొండో ఆప్షన్‌గా అదర్ దేన్ తెలంగాణ స్టేట్ అని ఉంది. తెలంగాణలోని పది జిల్లాల్లో జన్మించని వారు నాన్ లోకల్స్ కిందకు వస్తారు.

అయితే, చాలామంది విద్యార్థులు ఏపీలో జన్మించి తెలంగాణ వారిగా ఉన్న వారు ఉన్నారు. ఐదేళ్ల పాటు తెలంగాణలో చదవడం లేదా ఏడేళ్ల పాటు తెలంగాణలో జీవించడం ద్వారా తెలంగాణలో లోకల్స్‌గా ఉంటారు. కానీ, వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌లో ఆప్షన్స్ ఏపీలో పుట్టి, తెలంగాణ వారిగా ఉన్నవారికి ఇబ్బందికర పరిణామమే అంటున్నారు.

English summary
The one-time registration system facility provided by the Telangana State Public Service Commission for job aspirants on its website is sending jitters among students who were born in Andhra Pradesh but became locals of Telangana as per Article 371 (D).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X