వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో వాహనాలు కొని, తెలంగాణలో ఉంటే షాక్ తప్పదా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్‌ను ఆంధ్రప్రదేశ్ (ఏపీ) నుండి తెలంగాణ రాష్ట్రం (టీఎస్)కు మార్చుకోవాలనే జీవోను ఇష్యూ చేసేందుకు ట్రాన్స్‌పోర్ట్ డిపార్టుమెంట్ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇది పలువురు వాహనదారులకు ఇబ్బందులు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నలభై రోజుల క్రితం ట్రాన్సుపోర్ట్ డిపార్టుమెంట్ ఇందుకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య తిరుగుతున్న ప్రయివేటు వాహనాలు ఎంట్రీ ట్యాక్స్ కడుతున్నాయి.

Telangana shock to vehicle owners: Change registration from AP to TS

హైదరాబాద్ ఐటీ హబ్. పైగా రాజధాని. ఈ నేపథ్యంలో ఇక్కడకు పలు జిల్లాల నుండి మాత్రమే కాకుండా, ఇతర రాష్ట్రాల నుండి వివిధ పనుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం ప్రజలు వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చి.. ఇక్కడ పని చేస్తున్న వారు వారి వారి వాహనాల నెంబర్లను చేంజ్ చేసుకోవచ్చు.

లైఫ్ టైమ్ ట్యాక్స్ కట్టి వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది. తద్వారా నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు తమ వెహికిల్ రిజిస్ట్రేషన్ మార్చుకునేందుకు లైఫ్ టైమ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అప్పుడు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ వస్తుంది.

విభజన నేపథ్యంలో.. ఏపీలో వాహనాలు కొన్న వారు.. తెలంగాణలో ఉంచుకోవాలనుకుంటే అడిషనల్ లైఫ్ ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది. అప్పుడే రిజిస్ట్రేషన్ నెంబర్ మారుతుంది.

English summary
Telangana shock to vehicle owners: Change registration from AP to TS
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X