హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉద్యోగుల ప్లాన్: కేసీఆర్‌పై రాహుల్ గాంధీ ఆయుధం, తీసుకొస్తారా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని చూపించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును భయపెట్టేందుకు ఉద్యోగ సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి!

కొద్ది రోజుల క్రితం తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించి, మృతి చెందిన రైతు కుటుంబాలను పరామర్శించిన విషయం తెలిసిందే. రాహుల్ పర్యటన నేపథ్యంలో తెలంగాణలోని రైతుల ఆత్మహత్యలు, రైతు సమస్యలు జాతీయస్థాయిలో మార్మోగాయి.

రాహుల్ పర్యటన నేపథ్యంలో తెరాస ప్రభుత్వం కూడా కదిలింది. ఈ నేపథ్యంలో దీనినే తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయని అంటున్నారు.

Telangana staff ‘threaten’ to bring Rahul Gandhi to state

రాహుల్ గాంధీ ఆయుధాన్ని తెలంగాణ, ఏపీ ఉద్యోగుల విభజనకు ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలోనే ఉండాలని, ఏపీ ఉద్యోగులు ఏపీకి వెళ్లాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. విభజన జరిగి ఏడాది అవుతున్నా ఇంకా ఉద్యోగుల విభజన పూర్తి కాకపోవడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని ఉద్యోగ సంఘాలు రాహుల్ గాంధీని కలిసి తమ ఆవేదనను వెళ్లగక్కేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. జూన్‌లో అతనిని రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. రాహుల్ గాంధీని రప్పించడం ద్వారా తమ సమస్యను.. రైతు సమస్యలు అయినట్లుగా జాతీయం చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

English summary
Telangana employees are planning to use the ‘Rahul Gandhi weapon’ against the TRS government to highlight the ‘injustice’ being meted to them in bifurcation of staff between Telangana and AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X