వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్యాక్స్ చిచ్చుతో అన్నీ బంద్! రేపు చెల్లించాల్సిందే లేదంటే సీజ్, దేనికెంత?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాల మధ్య రవాణా పన్ను చిచ్చు రాజుకుంది! అన్ని రాష్ట్రాల్లాగే ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చే వాహనాలు రవాణా పన్ను చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, అధికారులు చెబుతున్నారు.

అయితే, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయినందున అనేక రాకపోకలు ఉంటాయని, పన్ను సరికాదని ఏపీ ట్రావెల్స్, ఏపీ మంత్రి చెబుతున్నారు. ఏపీ వాహనాలను ఇతర రాష్ట్రాల వాహనాలలాగే పరిగణిస్తామని తెలంగాణ రాష్ట్ర రవాణా అధికారులు ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి నుండి పన్ను వసూలు అమలవుతుందన్నారు.

మొదటి మూడు నెలలకు రేపు పన్ను కట్టాల్సిందేనని చెప్పారు. పన్నులు చెల్లించని వాహనాలను సీజ్ చేస్తామన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే పన్ను వసూలు చేస్తున్నట్లు చెప్పారు. అయితే, ఆర్టీసి విభజన కానందున ఆంధ్రప్రదేశ్ బస్సులకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణకూ రూ.80 కోట్ల వరకు రాబడి

మంగళవారం అర్ధరాత్రి నుండి ఏపీ వెహికిల్స్‌కు అంతర్రాష్ట్ర పన్నును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేయనుంది. దీని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రూ.70 నుండి రూ.80 కోట్ల వరకు రాబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.

హైకోర్టుకు...

తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం పైన తాము హైకోర్టుకు వెళ్తామని ఏపీ ప్రయివేట్ ట్రాన్సుపోర్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. అంతర్రాష్ట్ర పన్ను నేపథ్యంలో తెలంగాణకు వచ్చే చాలా వరకు బస్సులు, ఇతర వాహనాలు రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే చాలా వరకు రిజర్వేషన్లు రద్దయ్యాయి. తెలంగాణ రాష్ట్ర రాబడి పైన ఈ ప్రభావం కొంత ఉండవచ్చునని చెబుతున్నారు.

 Telangana State to tax vehicles coming from Andhra Pradesh

ఇరు రాష్ట్రాల మంత్రుల వాదన...

ఉమ్మడి రాష్ట్ర నిబంధన ముగిసినందునే అంతర్రాష్ట్ర రవాణా పన్నులు విధించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. ఏకపన్ను విధానంతో తెలంగాణ నష్టపోయిందన్నారు. కోర్టు ఆదేశాల మేరకే పన్నుల వసూలు నిర్ణయమన్నారు.

తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రల నుండి వచ్చే వాహనాల పైన పన్ను విధింపు ఉంటుందన్నారు. ఈ విషయమై ఏపీ మంత్రులు, ఆ రాష్ట్ర వాహనాల యజమానులు కలిశారని, వారికి కూడా నచ్చజెప్పానన్నారు. నిబంధనల ప్రకారమే వెళ్తున్నామన్నారు. చెక్ పోస్టుల బలోపేతానికి నిర్ణయం తీసుకుంటామన్నారు.

రవాణా పన్ను విధింపుపై తెలంగాణ ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రవాణా మంత్రి శిద్ధా రాఘవ రావు విజ్ఞప్తి చేశారు. రవాణ పన్ను విధింపు వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయన్నారు. రెండు రాష్ర్టాల ప్రజలు నష్టపోకూడదన్నదే తమ ఉద్దేశమన్నారు. ఏపీలో అంతరాష్ట్ర పన్నుల విధింపుపై ప్రస్తుతం ఎలాంటి ఆలోచన లేదన్నారు. ఉమ్మడి రాజధాని కారణంగా అనేక రాకపోకలు జరుగుతాయని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు..

జూలై 17, 2014న జారీ చేసిన సర్క్యూలర్ యథావిధిగా ఏప్రిల్ 1, 2015 నుండి అమలవుతుందని సోమవారం జారీ చేసిన (జీవో నెంబర్15) ఉత్తర్వుల్లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. అలాగే త్రైమాసిక వాహన పన్నుపై మరో నోటిఫికేషన్ ఇవ్వబోమని తెలిపింది.

ఇతర రాష్ట్రాల వాహనాల మాదిరిగానే ఏపీకి చెందిన వాహనాలను పరిగణిస్తామని చెప్పారు. పునర్విభజన చట్టాన్ని అనుసరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ వాహనాల నుండి పర్మిట్లకు సంబంధించి పన్ను వసూలు చేసే హక్కు ఉందని తెలిపింది.

విభజన సందర్భంగా గవర్నర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇరు రాష్ట్రాల వాహనాలు ఎటువంటి పన్నులు లేకుండా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో యథేచ్చగా తిరిగేందుకు కల్పించిన వెసులుబాటు మార్చి 31, 2015తో ముగుస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

పర్మిట్ల కోసం పన్నులు చెల్లించాల్సిన వాహనాలు ఇవే..

కాంట్రాక్టు క్యారెజెస్, గూడ్స్ క్యారెజెస్, మోటారు క్యాబ్స్, మాక్సీ క్యాబ్స్, కమర్షియల్ ట్రాక్టర్ ట్రయలర్స్, పాసింజర్ ఆటో రిక్షాలు వంటి వాహనాలకు పన్ను విధిస్తారు. వాహ పన్నును వసూలు చేసే సర్క్యూలర్‌ను జూలై 17, 2014న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. అయితే దీనిపై ట్రావెల్స్ యజమానులు కోర్టును ఆశ్రయించడంతో దానిని అమలు చేయలేదు. దీనిపై మరింత గడువు కోరారు. ఆ గడువు ఇప్పటితో ముగిసిందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

సుమారుగా ఏ వాహనానికి ఎంత పన్ను?

ఆల్ ఇండియా పర్మిట్ బస్సులకు రూ.3675
రాష్ట్ర పర్మిట్ బస్సులకు రూ.2665
మీడియం వెహికిల్స్‌కు రూ.1950 నుండి 2440కు పెంపు
లైట్ వెహికిల్ మోటార్స్‌కు రూ.430 నుండి రూ.1280కి పెంపు
ఆల్ ఇండియా మాక్సీ క్యాబ్స్‌కు రూ.1300
మాక్సీ క్యాబ్స్‌కు రూ.650
హెవీ వెహికిల్స్‌కు రూ.2970 నుండి రూ.5740 వరకు పన్ను
ఆర్టీసీ విభజన పూర్తికానందున ఆర్టీసీ బస్సులకు మినహాయింపు

English summary
Telangana State to tax vehicles coming from Andhra Pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X