వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరికొత్త వ్యూహంతో బాబుకు జగన్ 'ఊహించని' షాక్, టిడిపిలో కలవరం

ప్లీనరీలో వైసిపి నేతలు విమర్శలు చేస్తారని, వాటిని తిప్పికొడితే చాలని టిడిపి భావించిందా? కానీ వైసిపి అధినేత జగన్ టిడిపి ఊహించని విధంగా తొమ్మిది అంశాలపై కీలక ప్రకటన చేసి చిక్కుల్లో పడేశారా? అంటే అవుననే

|
Google Oneindia TeluguNews

అమరావతి: ప్లీనరీలో వైసిపి నేతలు విమర్శలు చేస్తారని, వాటిని తిప్పికొడితే చాలని టిడిపి భావించిందా? కానీ వైసిపి అధినేత జగన్ టిడిపి ఊహించని విధంగా తొమ్మిది అంశాలపై కీలక ప్రకటన చేసి చిక్కుల్లో పడేశారా? అంటే అవుననే అంటున్నారు.

పవన్ కళ్యాణ్ పేరెత్తని షర్మిల, అందుకే: హోదాపై జగన్ దాటవేత, బిజెపికి దగ్గరేనా?పవన్ కళ్యాణ్ పేరెత్తని షర్మిల, అందుకే: హోదాపై జగన్ దాటవేత, బిజెపికి దగ్గరేనా?

జగన్ తొమ్మిది అంశాలపై కీలక ప్రకటన చేస్తారని, 2019 ఎన్నికల్లో తాను గెలిస్తే ఏం చేస్తాననే విషయం ఇంత ముందుగా ప్రకటిస్తారని తెలుగు తమ్ముళ్లు ఊహించలేదని, జగన్ వారిని వ్యూహాత్మకంగా దెబ్బతీశారని అంటున్నారు.

ప్లీనరీలో జగన్, వైసిపి నేతలు ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు మాత్రమే చేస్తారని టిడిపి నేతలు ఊహించారని, అలా చేస్తే వాటిని గతంలో మాదిరి తిప్పికొట్టవచ్చునని భావించి ఉంటారని, కానీ జగన్ అనూహ్య నిర్ణయంతో అందరూ షాకయ్యారని అంటున్నారు.

Recommended Video

Chandrababu discussions In co ordination meeting Over strategies for Nandyal bypolls

అక్టోబర్ 27 నుంచి పాదయాత్రకు సిద్ధమైన జగన్.. ఆ లోపు జరిగిన ప్లీనరీలోనే తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానని చెప్పడంతో ప్రజలకు కూడా ఓ స్పష్టత ఏర్పడుతుందని అంటున్నారు. ఇప్పుడు టిడిపి అయోమయంలో పడిందని అంటున్నారు.

కొద్దిరోజులుగా చంద్రబాబు, టిడిపి నేతలు అంచనా..

కొద్దిరోజులుగా చంద్రబాబు, టిడిపి నేతలు అంచనా..

వైసిపిలో జరుగుతున్న పరిణామాలను, ప్లీనరీలో ఏం చేయబోతారనే అంశాలపై సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర టిడిపి నేతలు చాలా రోజులుగా కన్నేశారని అంటున్నారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ జగన్ ప్రజలకు తొమ్మిది హామీలు ఇచ్చారని అంటున్నారు.

బాబు సరే.. జగన్ ఎలా అమలు చేస్తారనేది ప్రశ్న

బాబు సరే.. జగన్ ఎలా అమలు చేస్తారనేది ప్రశ్న

అయితే, లోటు బడ్జెట్‌లో ఉన్న చంద్రబాబు 2014లో ఇష్టారీతిన హామీలు ఇచ్చారని జగన్ పలుమార్లు విమర్శించారు. మరి అలాంటప్పుడు జగన్ అంతకు ఎన్నో రెట్లుగా హామీలు ఇచ్చారని, మరి అలాంటప్పుడు ఆయన తన హామీలను ఎలా నెరవేరుస్తారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, జగన్ ఇచ్చిన హామీలు 2014లో చంద్రబాబు ఇచ్చి, ఇప్పుడు అమలు చేస్తున్నవే అంటున్నారు.

జగన్ వ్యూహంతో చంద్రబాబు షాక్

జగన్ వ్యూహంతో చంద్రబాబు షాక్

చంద్రబాబు ఎన్నికల వ్యూహాల్లో ఆరితేరి ఉన్నారని, ప్రతిపక్ష పార్టీల కన్నా ముందే కీలకమైన నిర్ణయాలతో వారిని కార్నర్ చేస్తారని అని అంటారు. ఇప్పుడు రెండేళ్ల ముందే జగన్ హామీలు ఇచ్చి, చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేశారని వైసిపి నేతలు అంటున్నారు. జగన్ ప్రకటనతో టిడిపి నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు.

జగన్ ప్రకటనపై వైసిపిలో చర్చ

జగన్ ప్రకటనపై వైసిపిలో చర్చ

జగన్ తొమ్మిది హామీలపై టిడిపిలో చర్చ సాగుతోందని తెలుస్తోంది. ఆయన ఇచ్చిన హామీలను ప్రజలను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనే విషయమై ఇరు పార్టీల్లోను చర్చ సాగుతోంది. జగన్ హామీలు అమలు సాధ్యమా అని సామాన్యుల్లోను చర్చ జరుగుతోందని చెప్పవచ్చు.

English summary
About two years ahead of the polls in Andhra Pradesh, YSR Congress Party national president YS Jagan on Sunday promised that he would take a series of measures aimed at bettering the lot of farmers and other sections of people if elected to power. It is said that TDP is fear of Jagan's welfare agenda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X