హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చక్రి ఉన్నాడని గర్వపడ్డాం: నాయిని, లోకేష్ పరామర్శ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సంగీత దర్శకుడు చక్రీ మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు. టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ... స్నేహానికి, మానవత్వానికి మారుపేరు చక్రి అన్నారు. ఆయన ఓ ఆశయం కోసం సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టారన్నారు. తెలంగాణలోని బిడ్డలకు చేయూతనిచ్చారని చెప్పారు. నాయిని మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అన్నారు. తెలంగాణ వ్యక్తి సంగీత దర్శకుడిగా ఉన్నాడని తాము గర్వంగా భావించేవాళ్లమన్నారు.

చక్రి

చక్రి

ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు చక్రి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన బాలకృష్ణ.

చక్రి

చక్రి

ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు చక్రి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన భౌతికకాయం వద్ద కన్నీరుమున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు.

చక్రి

చక్రి

ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు చక్రి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న బాలకృష్ణ.

చక్రి

చక్రి

ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు చక్రి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న నారా లోకేష్.

చక్రి

చక్రి

ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు చక్రి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న నారా లోకేష్.

చక్రి

చక్రి

ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు చక్రి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించిన గద్దర్.

చక్రి

చక్రి

ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు చక్రి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్న అల్లం నారాయణ.

శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఆయన భౌతికంగా లేకున్నప్పటికీ ఆయన పాటల్లో సజీవంగా ఉంటారన్నారు. ఎవరి సహకారం లేకుండా స్వతంత్రంగా ఎదిగిన వ్యక్తి అన్నారు. ఆయన లోటును తీర్చలేమన్నారు. అయితే, ఆయన గుర్తుగా సినీ ప్రముఖులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి, ఆయనకో స్థానం కల్పించాలన్నారు. ఆయన కుటుంబాన్ని సినీ పరిశ్రమ ఆదుకోవాలన్నారు.

జూపల్లి మాట్లాడుతూ... సినీ రంగంలో ఉన్న అతికొద్ది తెలంగాణ ప్రముఖుల్లో చక్రి ఒకరన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. చక్రి మృతి తెలుగు ప్రజల దురదృష్టమని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. చాలామందిని చిత్రసీమకు పరిచయం చేసిన వ్యక్తి అన్నారు. చక్రి పేరు మీద ఓ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

English summary
Telugu music director Chakri passes away, Political leaders condole
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X