వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్థరాత్రి వచ్చి కోరిక తీర్చమని: ఓనర్ కొడుకుతో టార్చర్.. రక్షించండి(వీడియో)

అర్థరాత్రి పూట తాను పడుకునే గది వద్దకు యజమాని కొడుకు వస్తుంటాడని, ఒకవేళ తలుపు తీయకుంటే మరుసటి రోజు ఉదయం నానా గొడవ చేస్తాడని తన గోడు వెల్లబోసుకుంది.

|
Google Oneindia TeluguNews

షార్జా: ఏజెంట్ల మోసాలు.. పని ప్రదేశాల్లో వేధింపులు.. గల్ఫ్ బాధితుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇటీవలి కాలంలో గల్ఫ్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. డబ్బు సంపాదిస్తామని సౌదీ వెళ్లేవాళ్లకు.. అక్కడి యజమానుల నుంచి విపరీతమైన వేధింపులు ఎదురవుతున్నాయి. మానసికంగా శారీరకంగా వారిని చిత్రహింసల పాలుచేస్తున్నారు.

దుబాయ్ లో తాను పడుతున్న కష్టాల గురించి తాజాగా ఓ మహిళ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్టు చేసింది. పని ఇప్పిస్తామని తీసుకొచ్చి.. తిరిగి తననే డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరిస్తున్నారని, ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారని వాపోయింది. ఓ కన్సల్టెన్సీ ద్వారా షార్జా వెళ్లిన ఆమె.. అక్కడి ఓ ఇంట్లో పనిమనిషిగా కుదిరింది. అప్పటినుంచి ఇంటి యజమానితో పాటు కన్సల్టెన్సీ నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి.

తొలుత వారం రోజుల పాటు పనిచేసి చూడు.. నచ్చకపోతే తిరిగి ఇండియా వెళ్లిపోవచ్చునని చెప్పారని, కానీ పరిస్థితి అలా లేదని బోరున ఏడుస్తూ చెబుతోంది. డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కన్సల్టెన్సీ నిర్వాహకులు తనను చిత్రహింసలు పెడుతున్నారని, తనతో పాటు ఉన్న ఫిలిప్పీన్స్ యువతులన్ని కూడా కొడుతున్నారని చెప్పింది.

తిరిగి ఇండియాకు వెళ్లిపోతానంటే.. రూ.2లక్షలు ఇచ్చి ఇక్కడి నుంచి కదలాలని హెచ్చరిస్తున్నారని ఆమె వాపోయింది. అంతేకాదు, అర్థరాత్రి పూట తాను పడుకునే గది వద్దకు యజమాని కొడుకు వస్తుంటాడని, ఒకవేళ తలుపు తీయకుంటే మరుసటి రోజు ఉదయం నానా గొడవ చేస్తాడని తన గోడు వెల్లబోసుకుంది. షార్జాలో తాను పనిచేస్తున్న ఇంటి చిరునామా చెప్పిన ఆ మహిళ.. ఎలాగైనా తనను రక్షించాల్సిందిగా వేడుకుంది.

English summary
A telugu woman who is facing troubles in Dubai was posted a video in Whatsapp to protect her. She appealed to Indian officers to help
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X