హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓయు త్యాగం మరుగుపర్చేయత్నం!: కేసీఆర్‌కు రివర్స్, అదేచోట టీడీపీ రేవంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోగొట్టుకున్న చోటనే తిరిగి తమ ప్రతిష్టను పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందా? తెరాస అధ్యక్షుడిగా నాడు కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఎదిగిన చోటునే టీడీపీ ఇప్పుడు తమకు వేదికగా మార్చుకుంటోందా? అంటే అవుననే చెప్పవచ్చు.

తెలంగాణ ఉద్యమం సమయంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు ఎంత కీలక పాత్ర పోషించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉస్మానియా ఉద్యమాలకు వేదికగా నిలిచింది. ఉద్యమం సమయంలో టీడీపీ పేరును ఉచ్చరించేందుకే వెనుకడుగు వేసిన సందర్భాలు ఉన్నాయి.

ఓయులో నాడు తెలంగాణ టీడీపీ నేతల పైన దాడి జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా ఎదిగింది, తెలంగాణ ఉద్యమం సాకారమైంది.. విద్యార్థుల వల్లనే. అందులో ఓయు పాత్ర ఎనలేదని. ఉద్యమం సమయంలో కేసీఆర్ ఓయూ విద్యార్థుల పోరాడాన్ని కొనియాడారు.

ఓయు విద్యార్థులను వీరులుగా, శూరులుగా పేర్కొన్నారు. ఉద్యమంలో మీ వెంటే ఉంటామని చెప్పారు. ఇప్పుడు అది రివర్స్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది.

Telugudesam supports OU students fight

కారణం ఏదైనా ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములను తీసుకొని ఇళ్లు కట్టిస్తామని కేసీఆర్ చెప్పడంపై ఓయూ విద్యార్థులు మండిపడుతున్నారు. కేసీఆర్ ఆ వ్యాఖ్యలు చేసినప్పటి నుండి ఓయు రగిలిపోతోంది. ఉద్యమాల గడ్డ ఓయులో తెలంగాణ వచ్చాక ఉద్యమాలు చల్లారుతాయని భావించారు!

కానీ తెలంగాణ వచ్చినా ఓయూలో ఉద్యమాలు ఆగడం లేదు. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు కేసీఆర్‌కు అండగా నిలబడ్డారు. అదే ఓయూ విద్యార్థులు ఇప్పుడు పైన తిరగబడుతున్నారు. దీని పైన కాంగ్రెస్, బీజేపీలు స్పందిస్తున్నాయి. ఓయూ భూములు తీసుకోవద్దని కేసీఆర్‌ను హెచ్చరిస్తున్నాయి.

అయితే, ఈ విషయంలో టీడీపీ మరో ముందడుగు వేస్తోందని చెప్పవచ్చు. ఆ పార్టీ నేతలు దీనిపై మండిపడుతున్నారు. తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అయితే మహానాడులో తెలంగాణ అమరవీరులపై తీర్మానం పెట్టారు. మహానాడు వేదికగా కేసీఆర్ పైన నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం విద్యార్థులు, ఓయు ద్వారానే సాధించామనే అంశాన్ని కేసీఆర్ మరుగుపర్చే ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

తెలంగాణ ఉధ్యమం సమయంలో.. ఓయూ విద్యార్థులను కేసీఆర్ శూరులు, హీరోలు అన్నారని, ఇప్పుడు మాత్రం సోయిలేనోళ్లని చెబుతున్నారని ఏకిపారేశారు. తెలుగుదేశం పార్టీ.. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఓయు అంశంతో కేసీఆర్ పైన నిప్పులు చెరగడం ద్వారా.. పోగొట్టుకున్న చోటనే తిరిగి పొందాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

English summary
Telugudesam supports OU students fight
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X