అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తుళ్లూరులో తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణం, అమరావతిలో శీతాకాల సమావేశాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులో ప్రభుత్వం తాత్కాలిక శాసన సభా భవనాన్ని నిర్మించనుంది. ఇందుకు సంబంధించి సభాపతి కోడెల శివప్రసాద రావు ఆదేశాలు జారీ చేశారు. తాత్కాలిక భవనం, యుద్ధ ప్రాతిపదికన నిర్మించనున్నందున ఎలాంటి అక్రమాలు జరగవద్దని ఆదేశించారు.

గుంటూరు జిల్లా తుళ్లూరులో తాత్కాలిక అసెంబ్లీని నిర్మించనున్నట్లు కోడెల మంగళవారం చెప్పారు. అసెంబ్లీ నిర్మాణం కోసం వెంటనే టెండర్లు పిలవాలని నిర్ణయించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు.

ఐదు రోజుల పాటు తుళ్లూరులోనే శీతాకాల సమావేశాలు జరపనున్నట్లు కోడెల చెప్పారు. రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి సమీపంలో తాత్కాలిక అసెంబ్లీ భవనాన్ని నిర్మించనున్నారు. ఐదెకరాలలో ఈ భవనం నిర్మిస్తారు.

Temporary AP Assembly building in Thullur

ఏపీ శాసన మండలి సమావేశాలు కూడా తుళ్లూరులోనే జరపాలని నిర్ణయించారు. స్పీకర్ ఓకే చెప్పినందున త్వరలో యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించనున్నారు. ప్రస్తుత శాసన సభను తలపించేలా రూపకల్పన చేయనున్నారు.

స్పీకర్ కోడెల శివప్రసాద్ డిజైన్లు పరిశీలించారు. వాటిని ముఖ్యమంత్రి నారా నారా చంద్రబాబు నాయుడు ఆమోదానికి పంపించారు. చంద్రబాబు ఆమోదం రాగానే యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

English summary
Temporary AP Assembly building in Thullur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X