నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిడిపి కార్పోరేటర్‌పై వైసిపి కార్పోరేటర్ దాడి, దౌర్జన్యం చేశారని సస్పెన్షన్

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: నెల్లూరు కార్పోరేషన్ కౌన్సెల్ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. అరుపులు, కేకల మధ్య గందరగోళ పరిస్థితి నెలకొంది. టిడిపి కార్పొరేటర్‌పై ప్రతిపక్ష వైసిపి కార్పొరేటర్‌ దాడి చేయటంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సుమారు పదకొండు నెలల తర్వాత నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. మొదటి నుంచి ఆటంకాల మధ్య సమావేశం జరుగుతూ వచ్చింది. సమావేశానికి వస్తున్న మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వాహనాన్ని కార్పొరేషన్‌ ప్రధాన ద్వారం దగ్గర సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నారు.

nellore

అనంతరం మరోసారి కార్మికులను కాంట్రాక్టులోకి మార్పు చేయాలన్న జీవో 279ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మేయర్‌ వాహనాన్ని మరోసారి అడ్డగించారు. ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో మేయర్‌ కింద పడ్డాడు.

నగరానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరుగుతున్న సమయంలో వైసిపి కార్పొరేటర్‌ ప్రసంగానికి అడ్డుతగిలాడన్న కోపంతో టిడిపి కార్పొరేటర్‌ ప్రశాంత్‌ కిరణ్‌పై దేవరకొండ అశోక్‌ దాడి చేశాడు. ప్రశాంత్‌ కిందపడిపోయాడు. దీనిపై సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.

ఘటన జరిగిన వెంటనే అశోక్‌ను సమావేశ నుంచి పంపి సస్పెండ్‌ చేస్తున్నట్లు మేయర్‌ అజీజ్‌ ప్రకటించారు. సభలో దౌర్జన్యానికి పాల్పడిన విషయమై పాలకవర్గం నుంచి తొలగించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపుతున్నట్లు మేయర్‌ చెప్పారు.

English summary
Tension prevails in Nellore District.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X