వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యను లా చదివిస్తున్న గజదొంగ ప్రకాష్ సాహూ

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న గజ దొంగ ప్రకాష్ సాహూ తన భార్యను న్యాయశాస్త్రం చదివిస్తున్నాడు. అందుకు అవసరమైన డబ్బులను అతను సమకూర్చినట్లు సమాచార. ప్రసాదంపాడు సాయిబాబా ఆలయంలో దోపిడీ చేశాడనే ఆరోపణపై విచారణ నిమిత్తం పోలీసులు సాహూను తమ కస్టడీలోకి తీసుకున్నారు.

సాహూ భార్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భిలాయ్‌లో న్యాయశాస్త్రం అభ్యసిస్తోంది. పిల్లలు సొంత పట్టణంలోనే పాఠశాలకు వెళ్తున్నారు. సాహూ 1980 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర పొరుగు రాష్ట్రాల్లో సాహూ 47 హిందూ, జైన ఆలయాల్లో దోపిడీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

prakash sahu

కనకదుర్గ గుడిలో ప్రకాష్ సాహూ అమ్మవారి కిరీటంతో పాటు ఆభరణాలన్నీ దోచుకున్నాడు. ఈ సంఘటన 1988లో జరిగింది. శ్రీకాకుళం జిల్లాలోని ఆరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం కన్యకాపరమేశ్వరి ఆలయంలో కూడా అతను దోపిడీలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆభరణాలను దోచుకునే ముందు సాహూకు దేవుళ్లకు ప్రార్థనలు చేసే అలవాటు ఉంది. నాలుగు దేవాలయాల్లో దోపిడీకి పాల్పడినట్లు సాహూ అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఒంగోలు, విజయనగరం, తూర్పు గోదావరి, విజయవాడల్లో దోపిడీలకు పాల్పడినట్లు సాహూ అంగీకరించినట్లు సమాచారం.

English summary
Notorious temple thief Prakash Sahu, who is currently in the custody of the police here for a robbery at the Sai Baba temple at Prasadampadu, is funding his wife’s law studies so that she can help him with his cases, said the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X