విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చితకబాది ఆటోను దొంగిలించిన 3గురి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆటో డ్రైవర్‌ను చితకబాది ఆదే ఆటోను దొంగిలించి తీసుకుపోతున్న ముగ్గురు నిందితులను విశాఖపట్నం పెందుర్తి పోలీసులకు పట్టుపడ్డారు. చోరీ సోత్తున పోలీసులు స్వాదీనం పరుచుకుని, నిందితులను అరెస్టు చేసి రిమారండ్గ తరిలించనున్నట్లు ఎడిసిపి చెప్పారు. ఈ మేరకు నగరంలో పోలీసు సమావేశమందిరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎడిసిపి(క్రైం) వరదరాజులు నిందితుల వివరాలను వెల్లడించారు.

గోపాలపట్నం సమీపంలో ఇద్దరు వ్యక్తులు ఆటోని ఆపి డ్రైవర్‌ కర్రి అప్పారావును చితక బాది తలపై రాతితో మోది ఆటోను తస్కరించి పరారయ్యారు. వీరంతా ఖమ్మం జిల్లా ఇందిరానగర్‌కు చెందిన గుర్రం కోటేశ్వరరావు అలియాస్‌ కోటి (22) రమణగుట్ట వికలాంగులకాలనికి చెందిన షేక్‌ సలీం (30) కానాపూర్‌ అవేలి వేణుగోపాల్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ సల్మాన్‌ (24) నిందుతులుగా గుర్తించామని ఎడిసిపి తెలిపారు. ఈముగ్గురు పాతనేరస్తులేనన్నారు. కిరాణాషాపులు , వైన్‌షాపులు దొంగతనాలు చేయడాన్ని వారు పనిగా పెట్టుకున్నట్లు తెలిపారు.

పాత నేరస్థుల అరెస్టు

పాత నేరస్థుల అరెస్టు

పోలీసులు తనిఖీ చేస్తుండగా ఆటోను దొంగిలించి తీసుకుపోతున్న ముగ్గురు పాత నేరగాళ్లు చిక్కారు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

పాత నేరస్థుల అరెస్టు

పాత నేరస్థుల అరెస్టు

ఆటో డ్రైవర్‌ను చితకబాది ఆదే ఆటోను దొంగిలించి తీసుకుపోతున్న ముగ్గురు నిందితులను విశాఖపట్నం పెందుర్తి పోలీసులకు పట్టుపడ్డారు. వారిని ఇలా పట్టుకుని తీసుకు వెళ్లారు.

పాత నేరస్థుల అరెస్టు

పాత నేరస్థుల అరెస్టు

చోరీ సోత్తున పోలీసులు స్వాదీనం పరుచుకుని, నిందితులను అరెస్టు చేసి రిమారండ్గ తరిలించనున్నట్లు ఎడిసిపి చెప్పారు.

పాత నేరస్థుల అరెస్టు

పాత నేరస్థుల అరెస్టు

గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎడిసిపి(క్రైం) వరదరాజులు నిందితుల వివరాలను వెల్లడించారు.

నల్గొండ జిల్లాలో 4, విశాఖ సిటిలో 4 నేరాల్లో వీరు నిందితులన్నారు. అక్టోబర్‌ 22న ఎన్‌ఎడి నుంచి పెందుర్తి వైపుగా వెళుతున్న ఆటోలో ఇద్దరు వ్యక్తులు పాసింజర్‌లుగా ఎక్కారు. గోపాలపట్నం దాటిన వెంటనే ఆటో డ్రైవర్‌ను గాయపరిచి ఆటోను ఎత్తుకు పోయారు. గురువారం పినగాడి జంక్షన్‌‌గలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా పెందుర్తివైపునుంచి వస్తున్న ఆటో ఎపి 31టిడి 2456 ను తనిఖీ చేయగా ముగ్గురు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించటంతో అసలు విషయం వెలుగు చూసింది.

వీరిని పోలీసులు పట్టుకొని విచారించగా పలు దొంగతనాల్లో నిందితులుగా గుర్తించామన్నారు. నల్గొండలో ఒక ఆటోను, రెండు సెల్‌షాపులు, టివిషోరూంలలో షట్టర్లు పగలగొట్టి సెల్‌ఫోన్లు ,ఎల్‌ఇడి టివిలు, హోందియోటర్‌ను దొంగిలించినట్లు అంగీకరించారని చెప్పారు. నగరంలో 4టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిదిలో తాటి చెట్లపాలెం సమీపంలో వైన్‌షాపును పగలు గొట్టి దొంగతనంకు పాల్పడ్డారు. అక్కయ్యపాలెం రవిచంద్ర కిరాణా షాపును పగలు గొట్టి లక్షా ముప్పై తొమ్మిదివేలరూపాయల నగదును దొంగతనం చేసినట్లు ఎడిసిపి తెలిపారు.

గాజువాక చట్టివానిపాలెం బ్రాందిషాపు ఎదుట ద్విచక్రవాహనాన్ని తస్కరించారు. చోరీ సొత్తును పోలీసులు స్వాదీనపరుచుకున్నట్లు ఎడిసిపి చెప్పారు. కేసును చేధించిన పెందుర్తి సిఐ ఆడమ్‌ , రామకృష్ణ, పిసిలు ఎం రాము.సిహెచ్మ్రణ,కెగంగరాజు, సుధీర్‌కుమార్‌లను ఎడిసిపి అభినందించి రివార్డులు ప్రకటించారు.

English summary
Three accused in auto theft at pendurthi in Visakhapatnam. The accused are from Khammam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X