వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టోపీ పెట్టేందుకు బంగ్లాదేశ్ నుంచి విశాఖకు: ముగ్గురి అరెస్ట్ (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తక్కువ మొత్తానికి అమెరికా డాలర్లు ఇస్తామని మోసం చేస్తున్న ముగ్గురు బంగ్లా దేశీయులను అరెస్ట్ చేసినట్లు విశాఖ క్రైమ్ డీసీపీ త్రివిక్రమ వర్మ తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ హలాల్, మహ్మద్ మసూద్ రాణా, హసీనా హలాల్, బిలాల్ షేక్ అనే నలుగురు పశ్చిమ బెంగాల్ మీదుగా ఆరు నెలల క్రితం విశాఖపట్నానికి వచ్చారు. మెకానిక్ లమని చెప్పి కంచరపాలెంలో అద్దెకు దిగారు.

టోపీ పెట్టేందుకు బంగ్లాదేశ్ నుంచి విశాఖకు: ముగ్గురి అరెస్ట్

టోపీ పెట్టేందుకు బంగ్లాదేశ్ నుంచి విశాఖకు: ముగ్గురి అరెస్ట్

నగరంలో సంచరిస్తూ తక్కువ మొత్తానికి అమెరికా డాలర్లు ఇస్తామని చెప్పి పలువురిని మోసం చేశారు. ఎంవీపీ కాలనీకి చెందిన ఒకరిని పరిచయం చేసుకుని తమ వద్ద యూఎస్ డాలర్లు ఉన్నాయని ఇండియన్ కరెన్సీ లక్ష రూపాయలు ఇస్తే 50 వేల డాలర్లు ఇస్తామని చెప్పారు.

టోపీ పెట్టేందుకు బంగ్లాదేశ్ నుంచి విశాఖకు: ముగ్గురి అరెస్ట్

టోపీ పెట్టేందుకు బంగ్లాదేశ్ నుంచి విశాఖకు: ముగ్గురి అరెస్ట్

అతడిని నమ్మించడానికి ముందు రెండు, మూడు డాలర్లు ఇచ్చారు. అతని వద్ద డబ్బు తీసుకుని మోసం చేశారు. అలాగే మహారాణిపేట, వన్ టౌన్ ప్రాంతాల్లో 30 రూపాయలకే డాలర్ ఇస్తామని నమ్మించి డబ్బు తీసుకుని పరారయ్యారు. వీరిపై మూడు కేసులు నమోదయ్యాయి.

 టోపీ పెట్టేందుకు బంగ్లాదేశ్ నుంచి విశాఖకు: ముగ్గురి అరెస్ట్

టోపీ పెట్టేందుకు బంగ్లాదేశ్ నుంచి విశాఖకు: ముగ్గురి అరెస్ట్

పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 20 డాలర్లు నోట్లు 7, ఒక డాలరు నోట్లు 4, ఇండియన్ కరెన్సీ 29, 210 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు బిలాల్ కోసం గాలిస్తున్నామని డీసీపీ తెలిపారు.

 టోపీ పెట్టేందుకు బంగ్లాదేశ్ నుంచి విశాఖకు: ముగ్గురి అరెస్ట్

టోపీ పెట్టేందుకు బంగ్లాదేశ్ నుంచి విశాఖకు: ముగ్గురి అరెస్ట్

నిందితుల వద్ద ఎలాంటి పాస్ పోర్టులు గానీ, ధ్రువీకరణ పత్రాలు గానీ లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లికార్జునరావుతో పాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

English summary
Visakhapatnam police today arrested three members of a four-member gang from Bangladesh for cheating in the guise of selling US dollars at low price . The City Task Force (CTF) Police led by ACP I Chittibabu, Sub-Inspector A Haribabu and Inspector R Mallikarjuna Rao laid a trap and arrested Mohammed Halal, a native of Sylhet city, Mohammed Masud Rana of Bagerhat district and Hasina of Sunamganj district
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X