విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాలువలో మూడు మృతదేహాలు: పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

By Pratap
|
Google Oneindia TeluguNews

Three dead bodies found in canal in West Godavari district.
విజయవాడ: పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు మండలం మొగల్తూరులాకులు వద్ద కాలువలో మూడు మృతదేహాలు కొట్టుకువచ్చాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాల్లో ఒక మహిళ, ఇద్దరు పురుషులు ఉన్నట్లు గుర్తించారు.

విశాఖపట్నం జిల్లాలోని ఎలమంచిలి మండలం పురుషోత్తవరం వద్ద అయ్యప్ప భక్తులకు పెను ప్రమాదం తప్పింది. వీరు ప్రయాణిస్తున్న బస్సు ముందు టైరు పంచర్‌ కావడంతో కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 35 మంది భక్తులు ఉన్నారు. డ్రైవర్‌ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. శబరిమల నుంచి విజయనగరం వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలోని జాతీయ రహదారిపై పేటకుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. గోరంట్ల మండలం ప్పునవల్లి తండాకు చెందిన సంతోష్ నాయక్, కిరణ్ నాయక్ ద్విచక్రవాహనంపై వెళ్తూ పేటంకుంట వద్ద అదుపు కిందపడిపోయి గాయాల పాలయ్యారు. వారు అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో హిందూపురం ఆస్పత్రికి తరలించే క్రమంలో అంబులెన్స్ బెంగళూరు నుంచి కర్నూలు వెళ్తున్న కారును ఢీకొట్టింది.

ఆ ప్రమాదంలో కారులో ఉన్న కర్నూలుకు చెందిన హేమసుందర్ రెడ్డి, అతని భార్య ప్రమిద, పిల్లలు గణేష్ రెడ్డి, మానసలు తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు అంబులెన్స్ డ్రైవర్ రంగనాథ్ కూడా గాయపడ్డాడు. వీరిని పెనుగొండ ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కొత్తూరు మండలంలోని అంకిరెడ్డిగూడకు చెందిన దేవపల్లి ప్రశాంత్ గౌడ్ (33), దేవల్లి నరేష్ గౌడ్ (24) ద్విచక్ర వాహనంపై షాద్‌నగర్ నుంచి అంకిరెడ్డిగూడ వైపు వస్తుండగా చంద్రాయణగుడా సమీపంలో వెనక నుంచి వచ్చిన డిసిఎం వీరిని ఢీకొట్టింది. నరేష్ గౌడ్ అక్కడికక్కడే మరణించగా, ప్రశాంత్ గౌడ్ షాద్‌నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

English summary
Three dead bodies found in canal in West Godavari district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X