వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్లీజ్! 'ఎన్టీఆర్' టీడీపీ పరువు పోగొట్టొద్దు: తెలంగాణ మంత్రి, రేవంత్‌పై పోచారం

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పరువును తీస్తున్నారని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు గురువారం నాడు మండిపడ్డారు. జాతి గౌరవం, చరిత్ర మరిచి పరువును బజారుపాలు చేస్తున్నారన్నారు. ఏ ఒక్కరూ ఎవరినీ రాజకీయ సమాధి చేయలేరన్నారు.

కొందరు ఎన్టీఆర్ పెట్టిన పార్టీ పరువు తీస్తున్నారని, ఎన్టీఆర్ గౌరవానికి భంగం కలిగిస్తున్నారన్నారు. ఎన్టీఆర్‌ని చూడని వ్యక్తులు ఆ పార్టీలో చిల్లర వేషాలు వేస్తున్నారన్నారు. చంద్రబాబు నికృష్ట రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. రేవంత్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి మంచివి కావన్నారు.

'Tummala Nageswara Rao says TDP leaders denting image of party

రాజకీయ నాయకులు హుందాగా మాట్లాడాలని, రౌడీల్లా కాదన్నారు. రేవంత్ ఆకు రౌడీ వేషాలు మానుకోవాలన్నారు. టీడీపీ నేతలు స్వలాభం కోసం దిగజారి మాట్లాడుతున్నారన్నారు. ప్రస్తుతం టీడీపీ ఎన్టీఆర్ ఆశయాలకు భిన్నంగా నడుచుకుంటుందన్నారు.

టీడీపీని బజార్లో అమ్ముతారని తాను ఆనాడే చెప్పానని, ఇప్పుడు అదే జరుగుతోందన్నారు. అద్దె మనుషులతో ఊరేగింపు తీయడం హీరోయిజం అనిపించుకోదన్నారు. దొంగతనం చేసి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నట్టు
ప్రవర్తిస్తున్నారన్నారు.

మీ పరువు పోతే పోయింది కానీ పార్టీ పరువును తీయొద్దన్నారు. బజార్లో బరితెగించి మాట్లాడుతున్నారన్నారు. జైలు నుంచి వస్తే స్వాతంత్ర సమరయోధుడు వచ్చినట్టు స్వాగతం పలికారన్నారు. మహాత్మా గాంధీకి కూడా ఇలా చేసినట్టు తాను చరిత్రలో చదవలేదన్నారు.

చంద్రబాబు తన రాజకీయ సమాధిని తానే కట్టుకుంటున్నాడన్నారు. ఒకరి రాజకీయ సమాధిని ఇంకొకరు కట్టరని ఎవరి రాజకీయసమాధిని వారే కట్టుకుంటారన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం తెలుగు జాతి గౌరవాన్ని మంటగలుపుతున్నారన్నారు. టీడీపీ నేతల తీరును చూసి తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.

షరతులతో కూడిన బెయిల్ మాత్రమే ఇచ్చారు: పోచారం

రేవంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిలు మాత్రమే ఇచ్చారని తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడి జైలుకెళ్లి వచ్చినట్లు హంగామా చేశారన్నారు. డబ్బుతో దొరికిపోయిన వ్యక్తి, కుట్ర పన్ని కేసులు పెట్టారని విమర్శించడమేమిటన్నారు.

ఎన్నికలకు ముందే పోలవరం పూర్తి: చంద్రబాబు

పశ్చిమ గోదావరిలోని పోలవరం ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 2019 ఎన్నికల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. గోదావరిని కృష్ణా నదితో అనుసంధానం చేస్తామన్నారు.

చర్యలు తీసుకుంటాం: పత్తిపాటి

నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పత్తిపాటి పుల్లారావు అన్నారు. విత్తనాలు, ఎరువుల అందుబాటు, నీరు-చెట్టు, ఉపాధిహామీ పనులపై గుంటూరు జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. విత్తనాలు అధికధరకు విక్రయిస్తే కఠినచర్యలు తీసుకుంటామన్నారు.

English summary
Tummala Nageswara Rao says TDP leaders denting image of party
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X