వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైఫై: శ్రీకారం చుట్టిన కెటిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు నూతన టికెట్ బుకింగ్ కౌంటర్‌ను ప్రారంభించారు. వైఫై సేవలను కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె. శ్రీవాత్సవ తదితరులు హాజరయ్యారు. తొలి 30 నిమిషాలు ఉచిత వైఫై సేవలు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు.

Two Pilots Killed in Chinese Naval Plane Crash

దక్షిణ మధ్య రైల్వేలోనే మొట్టమొదటి సారిగా సికింద్రాబాద్ లో వైఫై సేవలు ప్రారంభమయ్యాయని కెటిఆర్ చెప్పారు. దేశంలో 13 లక్షల ఉద్యోగులు కలిగిన సంస్థ రైల్వే అని చెబుతూ ఈ ఏడాది చివరి వరకు హైదరాబాద్ లో పూర్తిగా వైఫై సేవలు అందిస్తామని ప్రకటించారు.

దేశంలో 75 కోట్ల మంది మొబైల్స్ వాడితే అందులో 32 లక్షల మందికి పైగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని, వీంరంతా నెట్ సేవలు వినియోగిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు ఈ గవర్నెన్స్ నుంచి మొబైల్ గవర్నెన్స్ వైపు వెళుతున్నారని చెప్పారు. రైల్వే స్టేషన్ లో వైఫై సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతాయనిస సౌత్ సెంట్రల్ రైల్వే వైఫై సేవలు ప్రారంభించడం అభినందనీయమని చెప్పారు.

English summary
Telangana IT minister KT Rama Rao launched wifi services in Secendurabad railway ststaion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X