వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోశాలకు దూడలను విరాళమిచ్చిన వెంకయ్య తనయుడు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

తిరుమల: కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కుమారుడు హర్షవర్ధన్ బుధవారం సాయంత్రం టీటీడీకి చెందిన గోసంరక్షణ ట్రస్ట్‌కు ఆరు దేశీయ ఆవులను దానంగా ఇచ్చారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ చదవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన ఎస్వీ గోశాలకు వీటిని విరాళంగా అందించారు.

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీటీడీ ఈవో డి సాంబశివరావు, బోర్డు మెంబర్ జి భానుప్రకాశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ అధికపాలదిగుబడి ఇచ్చే హర్యానాలోని సాహివాల్‌ జాతికి చెందిన దేశవాళీ గోవులను వర్షవర్ధన్‌ తితిదేకి విరాళం అందించడం సంతోషకరమన్నారు.

గోశాలకు దూడలను విరాళమిచ్చిన వెంకయ్య తనయుడు

గోశాలకు దూడలను విరాళమిచ్చిన వెంకయ్య తనయుడు

హిందూ పురాణాల్లో గోవుకు ప్రత్యేక స్థానం ఉందని, దీన్ని గుర్తించి వాటి సంరక్షణకు టీటీడీ కృషి చేస్తోందన్నారు. గోపూజతో పాటు గోకులాష్టమి రోజున పెద్ద ఎత్తున ఉత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ గోసంరక్షణకు పాటుపడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

గోశాలకు దూడలను విరాళమిచ్చిన వెంకయ్య తనయుడు

గోశాలకు దూడలను విరాళమిచ్చిన వెంకయ్య తనయుడు

టీటీడీ ఈవో డా డి. సాంబశివరావు మాట్లాడుతూ శ్రీవారికి గోవు అత్యంత ప్రీతికరమైందన్నారు. దేశీయ గోవులు అంతరించిపోతున్న తరుణంలో ఎస్వీ గోసంరక్షణ ట్రస్టు ద్వారా వాటిని సంరక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతంలో తిరుపతిలోని గోశాలలో అత్యాధునిక వసతులతో నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వెల్లడించారు.

 గోశాలకు దూడలను విరాళమిచ్చిన వెంకయ్య తనయుడు

గోశాలకు దూడలను విరాళమిచ్చిన వెంకయ్య తనయుడు

దేశీయ గోవుల పాలు, గోమూత్రంలో ఔషధ గుణాలున్నాయని, వాటిపై పరిశోధన చేసి ప్రాచుర్యం కల్పిస్తామని చెప్పారు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు భానుప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ హిందూ సంస్కృతిలో తల్లి తర్వాత స్థానం గోమాతదే అన్నారు. దేశీయ గోవుల పాలతోనే శ్రీవారికి అభిషేకం, ఇతర కైంకర్యాలు జరుగుతున్నాయని చెప్పారు.

గోశాలకు దూడలను విరాళమిచ్చిన వెంకయ్య తనయుడు

గోశాలకు దూడలను విరాళమిచ్చిన వెంకయ్య తనయుడు

గోవధను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. అంతకుముందు తిరుపతికి చెందిన పి. నాగేశ్వర్‌ కుమారుడు హేమవెంకటనారాయణ భగవద్గీత శ్లోకాలను వినిపించారు. టీటీడీ ఛైర్మన్‌, ఈవో ఆ బాలుడిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ గోశాల సంచాలకులు హరినాథరెడ్డి, అసిస్టెంట్‌ డైరెక్టర్లు శ్రీనివాసులు, నాగరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

English summary
The Union Minister Sri M Venkaiah Naidu’s son Sri Harshavardhan on Wednesday evening donated six DESI cows with six calves to TTD run SV Gosamrakshana Trust. The donation was made by TTD Trust board chairman Dr Ch Krishnamurthy and board member Sri G Bhanuprakash Reddy on behalf of Sri Harshavardhan at SV Goshala who had handed over the cattle to TTD EO Dr D Sambasiva Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X