తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మెరుపుతీగ: కథ, స్త్రీన్ ప్లే, దర్శకత్వం: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉందని, రెండేళ్ల తరువాత ఆయనకు ఈ విషయం గుర్తుకు వచ్చిందని ఆయన.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉందని ఆయన సొంత జిల్లా అయిన చిత్తూరు ప్రజలు మండిపడుతున్నారు.

ఆయన సొంత నియోజక వర్గం అయిన పీలేరులో ఈ విషయంపై ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాయపాటి సాంబశివరావు తదితరులు ఆంధ్రప్రదేశ్ విభజన రాజ్యాంగానికి విరుద్దంగా జరిగిందని సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

United Andhra Pradesh former Chief Minister Nallari Kiran Kumar Reddy

మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ !

రాజ్యంగానికి విరుద్దంగా రాష్ట్ర విభజన బిల్లు ఆమోదించారని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రం విడిపోయి రెండు ఏళ్లకు పైగా అయ్యిందని, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, తెలంగాణలో తెరాస ప్రభుత్వాలు ఉన్నాయని పీలేరు ప్రజలు గుర్తు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ విభజనను కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకించారు. అయితే కాంగ్రెస్ పార్టీ పెద్దలు పిలిచి మరీ సీఎం చేసిన తరువాత ఆయన పూర్తిగా అధికారం అనుభవించిన తరువాత ఇలా ఎందుకు చేస్తున్నారు ? ఆయన రాష్ట్రం విడిపోకూడదు అని భావిస్తే అప్పుడే రాజీనామా చేయ్యాలి ? కదా అని ప్రశ్నిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డి తరువాత సొంత పార్టీ పెట్టుకున్నారు. అయినా తన సొంత తమ్ముడిని ఆయన సొంత నియోజక వర్గం పీలేరులో గెలిపించుకోలేకపోయారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో రీ ఎంట్రీ ఉంటుందని, అందుకే మళ్లీ రంగంలోకి దిగుతున్నారని ఆయన మద్దతుదారులు అంటున్నారు.

English summary
Nallari Kiran Kumar Reddy is the last Chief Minister of the United Andhra Pradesh before the formation of the Telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X