అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సస్పెన్షన్ వేటుతో టిడిపి నేతల గైరాజర్, ఒంటరిగానే ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన వాకాటి

ఎమ్మెల్సీగా ఎన్నికైన వాకాటి నారాయణరెడ్డి సోమవారం నాడు ప్రమాణం చేశారు.వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై సిబిఐ సోదాలు చేసిన నేపథ్యంలో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు టిడిపి అదినేత చంద్రబాబునాయుడు శన

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:ఎమ్మెల్సీగా ఎన్నికైన వాకాటి నారాయణరెడ్డి సోమవారం నాడు ప్రమాణం చేశారు.వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై సిబిఐ సోదాలు చేసిన నేపథ్యంలో ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు టిడిపి అదినేత చంద్రబాబునాయుడు శనివారంనాడే ప్రకటించారు.పార్టీ నుండి సస్పెండ్ కావడంతో పార్టీ నేతలు ఎవరూ కూడ ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి హజరుకాలేదు.

శాసనమండలి ఛైర్మెన్ చక్రపాణి సోమవారం నాడు వాకాటి నారాయణరెడ్డితో ప్రమాణం చేయించారు. అయితే ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి టీడీపీ నేతలు దూరంగా ఉన్నారు. దీంతో ఆయన ఒంటరిగానే ప్రమాణస్వీకారోత్సవానికి హజరయ్యారు. పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ తీసుకొన్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని చెప్పారు.

vakati narayana reddy

మళ్ళీ టిడిపితో, చంద్రబాబుతో కలిసి పనిచేస్తానని చెప్పారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశం కల్పించిన చంద్రబాబు, లోకేష్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బ్యాంకు రుణాల చెల్లింపులో జాప్యం జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు. రుణాలను రీ స్ట్రక్చర్ చేసే అంశంపై ఆలోచిస్తున్నామని రెండు మూడు నెలల్లోనే అంతా సర్ధుకొంటుందన్నారు వాకాటి నారాయణరెడ్డి.

వాకాటి నారాయణరెడ్డి ఇంటిపై సిబిఐ అధికారులు దాడులు చేశారు. వివిధ బ్యాంకులకు రూ.450 కోట్ల మేర వాకాటినారాయణరెడ్డి విల్ పుల్ డీఫాల్టర్ గా ఉన్నారనే విషయమై దర్యాప్తు చేసేందుకు సిబిఐ ఈ సోదాలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మరో వైపు ఎమ్మెల్సీగా శత్రుచర్ల విజయరామరాజు కూడ ప్రమాణం చేశారు.

English summary
Vakati Narayana Reddy swearing as a MlC on Monday.Tdp chief Chandrababu naidu suspeneded him from Tdp on Saturday, Cbi officers searched Vakati offices and hours on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X