వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజాలో మార్పు రాలేదు, ఏమైనా పర్వతమా లేక..: వంగలపూడి అనిత

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాను అడ్డుకోలేకే ప్రభుత్వం ఆమె పైన సస్పెన్షన్ పొడిగింపు చర్యలు తీసుకోవాలనుకుంటుందన్న వైసిపి ఆరోపణలపై టిడిపి ఎమ్మెల్యే అనిత ఘాటుగా స్పందించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజాను అడ్డుకోలేకే ప్రభుత్వం ఆమె పైన సస్పెన్షన్ పొడిగింపు చర్యలు తీసుకోవాలనుకుంటుందన్న వైసిపి ఆరోపణలపై టిడిపి ఎమ్మెల్యే అనిత ఘాటుగా స్పందించారు.

రోజాను చూసి భయపడేందుకు ఆమె ఏమైనా పర్వతమా లేక సబ్జెక్టుల్లో నిపుణురాలా అని నిలదీశారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను రోజాతో క్షమాపణలు చెప్పించాల్సిన బాధ్యత జగన్‌కు లేదా అని ప్రశ్నించారు.

<strong>నాన్న చంద్రబాబుకు మాటిచ్చారు: అఖిలప్రియ, ఏ కక్షలు లేవని శిల్పా</strong>నాన్న చంద్రబాబుకు మాటిచ్చారు: అఖిలప్రియ, ఏ కక్షలు లేవని శిల్పా

రోజాపై ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదిక సంతృప్తిని ఇచ్చిందని చెప్పారు. నివేదికపై స్పీకర్, సభ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. అసెంబ్లీ ఘటనలను ఎడిట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదన్నారు.

Vangalapudi Anitha slams YSRCP MLA Roja

రోజా వ్యాఖ్యల కారణంగా తాను చాలాకాలం డిప్రెషన్‌లోకి కూడా వెళ్లానని చెప్పారు. రోజా మాట తీరు అసభ్యంగా ఉందని చెప్పారు. ఆమె ఎంతో జ్ఞానవంతురాలు, మేం తట్టుకోలేమని మాకు ఏమాత్రం లేదన్నారు.

అసెంబ్లీలో రోజా ప్రవర్తనకు ఏడాది పాటు సస్పెన్షన్ వేస్తే, ఆమెలో ఏ మార్పు రాలేదన్నారు. ఈ విషయం అందరికీ తెలుసునని చెప్పారు. అలాంటప్పుడు ఆమెపై సస్పెన్షన్ వేయడమే మంచిదన్నారు.

నేను క్షమాపణ చెప్పనని రోజా అంటున్నారని, అలా అంటే ఎలా అన్నారు. ఎడిటింగ్, డబ్బింగ్ చేసేందుకు ఇది (అసెంబ్లీ) సభ అన్నారు. సభలో ఆమె క్షమాపణ చెప్పి, స్పీకర్ ఓకే చేస్తే తాను సంతృప్తి చెందుతానని చెప్పారు. ఎడిటింగ్ చేశారనుకుంటే న్యాయపోరాటం చేయవచ్చన్నారు.

English summary
Telugudesam party MLA Vangalapudi Anitha slams YSRCP MLA Roja for her attitude in Andhra Pradesh Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X