వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్, గాలిలని అదుపులోకి తీసుకోవాలి, సిబిఐ-ఐటీలకు లేఖ: టిడిపి ఝలక్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిలను వెంటనే అదుపులోకి తీసుకొని వారు ఆస్తులను లెక్కకట్టాలని వర్ల రామయ్య అన్నారు

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిలను వెంటనే అదుపులోకి తీసుకొని వారు ఆస్తులను లెక్కకట్టాలని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య బుధవారం డిమాండ్ చేశారు.

2004కు ముందు, ఆ తర్వాత జగన్ ఆస్తులు లెక్క తేల్చాలన్నారు. ఈ మేరకు సిబిఐ, ఆదాయపన్ను, ఈడీ శాఖల అధికారులకు లేఖ రాయనున్నట్లు చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో జగన్‌కు చలిజ్వరం వచ్చి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. నల్లకుబేరుల భరతం పట్టేందుకు ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు.

ys jagan

ప్యాకేజీ చట్టబద్దతపై ప్రధానిని కలుస్తాం: సుజనా

కేంద్రమంత్రి సుజనాచౌదరి నివాసంలో బుధవారం టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. నోట్ల రద్దు ఇబ్బందులు, కేంద్రం నుంచి తీసుకోవాల్సిన సాయంపై చర్చించినట్లు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

'అప్పుడు రాజకీయాల్లో మరింత కీలకంగా పవన్ కళ్యాణ్''అప్పుడు రాజకీయాల్లో మరింత కీలకంగా పవన్ కళ్యాణ్'

పార్లమెంటులో చర్చ జరగకుండా విపక్షాలు అడ్డుకోవడం సరికాదన్నారు. సభ సజావుగా నడపాల్సి ఉందని విపక్షాలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధతపై ప్రధాని మోడీని కలుస్తామని, వారంలోగా చట్టబద్ధత ప్రకటించి రాష్ట్రానికి తెలియజేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. రైల్వేజోన్‌ అంశంపై సురేశ్ ప్రభును కలుస్తామన్నారు.

English summary
Varla says he will write CBI about YS Jagan and Gali assets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X