విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వర్మ 'వంగవీటి' సినిమా: 'గాయం' సినిమాలో రంగా క్యారెక్టర్ ఇలా...

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తాజాగా రామ్ గోపాల్ వర్మ వంగవీటి అనే సినిమాను తీస్తున్నారు. రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమం చెలరేగుతున్న సమయంలో ఆయన ఆ సినిమాను మార్కెట్ కూడా చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం జనవరి 31వ తేదీన నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభలో వంగవీటి రంగా అమర్ రహే అంటూ నినాదాలు వినిపించాయి.

కాపు ఐక్య గర్జన ఫ్లెక్సీలు, పోస్టర్ల మీద కూడా ఆయన చిత్రం ప్రముఖంగా ఉంది. కాపుల నేతగా వంగవీటి రంగా పేరు సంపాదించుకున్నారు. వంగవీటి రంగా విషయంలో రామ్ గోపాల్ వర్మ ఆయన కుమారుడు వంగవీటి రాధాతో ఇటీవల వివాదానికి కూడా దిగారు.

Also Read: వర్మ ‘వంగ‌వీటి రంగా' ఇతనే(ఫొటోలు)

అయితే, గాయం సినిమాలో జగపతి బాబు క్యారెక్టర్‌ను వంగవీటి రంగాను దృష్టిలో పెట్టుకునే రామ్ గోపాల్ వర్మ తీర్చిదిద్దారని అంటారు. ఆ సినిమా 1993లో వచ్చింది. విజయవాడ రాజకీయ మాఫియాను తెరకెక్కించిన సినిమా. వంగవీటి రంగా సోదరుడు వంగవీటి రాధాకృష్ణ ప్రత్యర్థుల చేతుల్లో హతం కావడం, అనివార్యంగా ఆయన పాత్రను వంగవీటి రంగా పోషించాల్సి రావడాన్ని ఇతివృత్తంగా గ్రహించే గాయం కథను రామ్ గోపాల్ వర్మ రూపొందించారని అంటారు.

Varma characterises Vangaveeti Tanga in Gamyam

దుర్గ (జగపతిబాబు), అనిత (రేవతి) ప్రేమాయణాన్ని వాస్తవ సంఘటనల నుంచే తీసుకున్నారా, లేదా అనేది కచ్చితంగా చెప్పలేం గానీ సినిమాలో మోహనకృష్ణ (చరణ్ రాజ్) స్థానిక ఎమ్మెల్యే గురునారాయణ (కోట శ్రీనివాస రావు) మనుషుల చేతిలో హతం కావడం, తన సోదరుడిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాల్సి రావడం మాత్రమే కాకుండా తన సోదరుడిని నమ్ముకుని ఉన్నవాళ్లకు అండగా ఉండాల్సి రావడం అనే అనివార్యమైన పరిస్థితుల్లో దుర్గ పొలిటికల్ మాఫియాలో కింగ్‌గా మారినట్లు రామ్ గోపాల్ వర్మ చూపించారు.

వంగవీటి రాధా ఓ పిల్లాడు, రంగా గురించి ఏం తెలుసు: రామ్ గోపాల్ వర్మ వంగవీటి రాధా ఓ పిల్లాడు, రంగా గురించి ఏం తెలుసు: రామ్ గోపాల్ వర్మ

పోతే, ఆ తర్వాత దుర్గ హైదరాబాద్ రావడం, హైదరాబాదులో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నించినవారిని ఎదుర్కోవడం అనే సంఘటనలు దానికి వాస్తవదూరంగా ఉన్నాయి. మొత్తం మీద, రామ్ గోపాల్ వర్మకు రంగా మీద మంచి అవగాహనే ఉందని అనుకోవచ్చు. ఏమైనా, కాపు ఉద్యమం ఊపందుకున్న సమయంలో దాన్ని రామ్ గోపాల్ వర్మ తెర మీదికి తెచ్చారు.

English summary
Dirctor and producer Ram Gopal varma has already characterised Vangaveeti Ranga in his Gayam film.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X