నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

‘కంట్రోల్ రూం నుంచే మంత్రుల ఆదేశాలు, బాబుకు తెలియదా?’: వాసిరెడ్డి నిలదీత

నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. సీఎం నుంచే అధికారులకు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. సీఎం నుంచే అధికారులకు ఆదేశాలు వెళ్లడంపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.

జగన్ వ్యాఖ్యలపై సీఈసీ సీరియస్: తక్షణ చర్యలకు ఆదేశంజగన్ వ్యాఖ్యలపై సీఈసీ సీరియస్: తక్షణ చర్యలకు ఆదేశం

బాబుకు తెలియదా?

బాబుకు తెలియదా?

పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సీఎం ప్రెస్ మీట్ పెట్టడం ఏంటని వాసిరెడ్డి నిలదీశారు. ముఖ్యమంత్రికి ఎన్నికల నియమావళి తెలియదా? అని ప్రశ్నించారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని వాసిరెడ్డి చెప్పారు.

కంట్రోల్ రూం నుంచే ఆదేశాలు

కంట్రోల్ రూం నుంచే ఆదేశాలు

మంత్రులు కంట్రోల్ రూంలో ఉండి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నంద్యాలలో ఎందుకు తిరుగుతున్నారని పద్మ నిలదీశారు.

అంతా బాబే చేస్తున్నారు..

అంతా బాబే చేస్తున్నారు..

అంతా సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలుపును అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేయాలని ఆమె అన్నారు.

దుర్మార్గం..

దుర్మార్గం..

పోలీసులు అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరించడం సరికాదని వాసిరెడ్డి పద్మ అన్నారు. మంగళవారం రాత్రి శిల్పామోహన్ రెడ్డి ఏజెంట్ల విషయంలో దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఆధార్ కార్డు చూపించినా చక్రపాణి రెడ్డిని నంద్యాల నుంచి పంపాలని చూశారని అన్నారు.

English summary
YSR Congress Party leader Vasireddy Padma on Wednesday slammed Andhra Pradesh CM Chandrababu Naidu for press meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X