నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఛానల్, పేపర్ ఎవరిదిరా? బట్టేబాజ్: జగన్‌పై వేణుమాధవ్ తీవ్ర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

కర్నూలు: నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి తరపున ప్రచారం చేస్తున్న సినీ హాస్యనటుడు వేణుమాధవ్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్న రోడ్ షోలో ఆయన పక్కనే ఉన్న వేణు మాధవ్.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు.

'ఏడ్చుకుంటూ వెళ్లు': రోజా, జగన్‌లపై వేణుమాధవ్ సెటైర్లు, వారించిన టీజీ'ఏడ్చుకుంటూ వెళ్లు': రోజా, జగన్‌లపై వేణుమాధవ్ సెటైర్లు, వారించిన టీజీ

బట్టేబాజ్ అంటూ..

బట్టేబాజ్ అంటూ..

‘ఒకడేమో నాకు ఛానల్ లేదు.. పేపర్ లేదని అంటున్నాడు.. మరి ఆ ఛానల్ ఎవరిది, పేపర్ ఎవరిదిరా బట్టేబాజ్' అంటూ తీవ్ర పదజాలంతో నిలదీశారు. ఆ తర్వాత తాను ఎవరినీ విమర్శించనని, విమర్శించే అలవాటు తనకు లేదని వేణుమాధవ్ చెప్పడం గమనార్హం.

వారి గురించా.. నీచం.. నికృష్టం

వారి గురించా.. నీచం.. నికృష్టం

‘నా బిడ్డలతో సమానమైన భూమా అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డిల గురించి విమర్శించిన వారి గురించి నేను మాట్లాడటమా... థూ... నీచం, నికృష్టం' అని వేణు మాధవ్ అన్నారు.

ఎక్కడ చూసినా..

ఎక్కడ చూసినా..

కర్నూలు నుంచి నంద్యాలకు ఒక గంటలో వచ్చేస్తానని అనుకున్నానని కానీ చాలా సమయం పట్టిందని... అన్ని చోట్లా అభివృద్ధి కార్యక్రమాలే జరుగుతున్నాయని.. ఎక్కడ చూసినా ప్రొక్లైనర్లే కనిపిస్తున్నాయని వేణు మాధవ్ తెలిపారు. కొంత మంది గుర్తు పట్టుకుని తిరుగుతున్నారని.. మన గుర్తు మాత్రం మన గుండెల్లోనే ఉందని అన్నారు.

బాబుకు ప్రచారానికి రావొద్దని చెప్పా..

బాబుకు ప్రచారానికి రావొద్దని చెప్పా..

కొంత మందికి పార్టీ గుర్తు ఏందో గుర్తులేక గుర్తు పట్టుకుని తిరుగుతున్నారని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. చంద్రబాబుని నంద్యాల ప్రచారానికి రావద్దని తాను కోరానని... ఇక్కడ గెలుపు ఖాయమని, మీరు అక్కడే కూర్చుని టీవీల్లో చూడమని చెప్పానని వేణు మాధవ్ తెలిపారు. నంద్యాలలో ఎంత మెజార్టీ వస్తుందో ప్రత్యక్షంగా చూడటానికే చంద్రబాబు వచ్చారని అన్నారు.

English summary
Cine Actor Venu Madhav on Saturday lashed out at YSR Congress Party president YS Jaganmohan Reddy in Nandyal campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X