విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ మూర్ఖుడు, బీకాంలో ఫిజిక్స్ మంత్రి పదవికి అడ్డు: జలీల్ సంచలనం

బీకాంలో ఫిజిక్స్ సబ్జెక్టు ఉంటుందని ఇంటర్వ్యూలో చెప్పడం తనకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడానికి ఒక కారణంగా అన్పిస్తోందని విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అభిప్రాయపడ్డారు.ఈ మేరకు ఆయన ఓ తెలుగు టీవి ఛానల్ కు

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: బీకాంలో ఫిజిక్స్ సబ్జెక్టు ఉంటుందని ఇంటర్వ్యూలో చెప్పడం తనకు మంత్రివర్గంలో చోటు దక్కకపోవడానికి ఒక కారణంగా అన్పిస్తోందని విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అభిప్రాయపడ్డారు.ఈ మేరకు ఆయన ఓ తెలుగు టీవి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

వైసీపి నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించిన జలీల్ ఖాన్ ఏడాది క్రితం టిడిపిలో చేరారు. ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కుతోందని ప్రచారం సాగింది.అయితే ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కలేదు.

అయితే మంత్రివర్గంలో ముస్లింలు ఎవరీకి కూడ చోటు దక్కలేదు. అయితే ముస్లింలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని భావించినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదని బాబు ముస్లిం నాయకులకు చెప్పారు.

అయితే మంత్రిపదవి దక్కకపోవడంతో కొంత అసంతృప్తి లేదంటున్నారు జలీల్ ఖాన్. ఈ మేరకు ఈ ఓ టీవి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

బీకాం ఫిజిక్స్ వల్లే మంత్రిపదవి రాలేదేమో

బీకాం ఫిజిక్స్ వల్లే మంత్రిపదవి రాలేదేమో

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ పునర్వవ్యవస్తీకరణలో తనకు చోటుదక్కకపోవడానికి బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని చెప్పడం కూడ కారణమనే అభిప్రాయాన్ని విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయాన్ని కొందరు టిడిపి సీనియర్లు తన వద్ద ప్రస్తావించారని ఆయన చెప్పారు.అయితే ఈ విషయాన్ని కూడ తాను ఊహించానని చెప్పారు.అయితే మంత్రిపదవి కోసమే టిడిపిలో చేరలేదన్నారు.

ఫిజిక్స్ ఆఫ్షనల్ సబ్జెక్ట్

ఫిజిక్స్ ఆఫ్షనల్ సబ్జెక్ట్

బీకాంలో ఫిజిక్స్ ఉంటుందనే విషయాన్ని తాను ఇంటర్వ్యూలో చెప్పలేదన్నారు జలీల్ ఖాన్, అయితే తాను బాగా చదివి పాస్ అయ్యాయనని, అయితే ఉన్నత చదువులు కొనసాగించే విషయమై వేసిన ప్రశ్నకు తాను చెప్పిన సమాధానాన్ని ఓ రిపోర్టర్ ఇతర సమాధానాన్ని మిక్స్ చేశాడన్నారు.

అయితే తాను 30 ఏళ్ళ క్రితం చదువుకొన్న సమయానికి, నేటీకి మార్పులు చోటుచేసుకొని ఉండవచ్చని విలేకరి చెప్పిన మాటలను బట్టి అనుమానించానని చెప్పారు.అయితే తాను బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని చెప్పలేదన్నారు.ఓపెన్ యూనివర్శిటీలో ఫిజిక్స్ ఆఫ్షనల్ సబ్జెక్ట్ గా ఉంటుందని ఆయన చెప్పారు.ఇది కామన్ సబ్జెక్ట్ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ విషయం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందా అంటూ ఆయన ప్రశ్నించారు.

బీకాంలో ఫిజిక్స్ తో పాపులర్ అయ్యా

బీకాంలో ఫిజిక్స్ తో పాపులర్ అయ్యా

వైసీపీ నుండి టిడిపిలో చేరిన తర్వాత వైసీపీ చీఫ్ జగన్ ను తిట్టి పాపులర్ అయితే, బీకాంలో ఫిజిక్స్ ఉంటుందని ఇచ్చిన ఇంటర్వ్యూతో మరింత పాపులరయ్యారు జలీల్ ఖాన్, అయితే మీడియా కూడ చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వదన్నారు జలీల్. హ్యూమరస్ గా ఉంటేనే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇదే సూత్రాన్ని పాటించానని జలీల్ ఖాన్ చెప్పారు.

 జగన్ మూర్ఖుడు

జగన్ మూర్ఖుడు

జగన్ మూర్ఖుడు. వైసీపీలో చిన్నా, పెద్ద అనే తేడా తెలియదు.అసలు పార్టీ నాయకులకు గౌరవం ఉండదని జగన్ ను ఏకేశారు జలీల్ ఖాన్. రాష్ట్రం అభివృద్ది జరగాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అవసరమన్నారు.ఏదైనా సలహా చెబితే జగన్ నవ్వేవారు.జగన్ జాతీయగీతం పాడితే తాను రాజకీయాల నుండి తప్పుకొంటానని చెప్పారు. రెండు 25 లు 68 ఎలా అవుతాయని ఆయన ప్రశ్నించారు.

నాకు న్యాయం జరిగితే కమ్యూనిటీకి జరిగినట్టే

నాకు న్యాయం జరిగితే కమ్యూనిటీకి జరిగినట్టే

తనకు న్యాయం జరిగితే తన కమ్యూనిటీకి న్యాయం జరిగినట్టేనని జలీల్ ఖాన్ చెప్పారు. అందరికీ న్యాయం చేస్తారని తనకు నమ్మకం ఉందన్నారు.అయితే అన్ని కులాలకు న్యాయం జరిగేలా చేస్తారు. ముస్లింలకు న్యాయం చేస్తానని చంద్రబాబు హమీ ఇచ్చారు. తొందరపడకూడదన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తాను టిడిపి తరపునే పోటీచేస్తానని ఆయన చెప్పారు.తొలుత వైసీపీ నుండి తానే టిడిపిలో చేరానని తన తర్వాత టిడిపిలో చేరిన వారికి మంత్రిపదవులు దక్కాయన్నారు.

English summary
Vijayawada MLA Jaleelkhan slams Ysrcp chief ys Jagan. He didn't know how to respect party leaders.Chandrababunaidu will do justice for muslims said jaleelkhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X