విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెజవాడ దోపిడి: సినీఫక్కిలో వేట, పడవలో లంకకు, వాటాలకోసం ముంబైకి

విజయవాడలో సినీఫక్కిలో చోటుచేసుకొన్న శంకర్‌మన్నా బంగారం దోపిడిని పోలీసులు చేధించారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ దోపిడి కేసును చేధించేందుకు పోలీసులు చాలా కష్టపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడలో సినీఫక్కిలో చోటుచేసుకొన్న శంకర్‌మన్నా బంగారం దోపిడిని పోలీసులు చేధించారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ దోపిడి కేసును చేధించేందుకు పోలీసులు చాలా కష్టపడ్డారు. ఈ దోపిడిలో ఈ దుకాణంలో పనిచేసిన మాజీ ఉద్యోగి కీలకంగా వ్యవహరించారిని తేలింది. దీంతో అతడి ఫోన్లపై నిఘాను పెట్టడంతో ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగలిగారు.

సినీఫక్కిలో జరిగిన బంగారం దోపిడి కేసును నగరంలో సంచలనం సృష్టించింది. మెరుపువేగంతో వచ్చిన దొంగలు అంతే వేగంతో దోపిడికి పాల్పడి కారులో పారిపోయారు. అయితే నిందితులు పారిపోతూ కార్ఖానాలోని మూడు సెల్‌ఫోన్లను కూడ ఎత్తుకెళ్ళారు. 13 రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకొంది.

5 కిలోల బంగారం, రూ.2.5 లక్షల నగదు చోరి అయింది. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టేలోపుగానే వారంతా జిల్లాను దాటివెళ్ళిపోయారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల ఎస్‌పిలను విజయవాడ నగర పోలీస్ కమిషనర్ అప్రమత్తం చేశారు.అప్పటికే నిందితులు గుంటూరు జిల్లా కాజా టోల్‌గేట్‌ను దాటారు.

నిందితులను పట్టుకొనేందుకు పోలీసులు వేటను సాగించారు. అయితే పోలీసులకు పట్టుబడకుండా నిందితులు అనేక జాగ్రత్తలు తీసుకొన్నారు. కానీ, పోలీసులు మాత్రం ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ, తమ ప్రయత్నాలను వీడలేదు.

సినిమా తరహలోనే వేట సాగించిన పోలీసులు

సినిమా తరహలోనే వేట సాగించిన పోలీసులు

సినిమాల్లో నిందితులను పట్టుకొనేందుకు హీరో ఏ రకంగా వ్యవహరిస్తారో... అదే తరహలో విజయవాడ పోలీసులు కూడ ఈ దోపిడికి పాల్పడిన నిందితులను పట్టుకొనేందుకు ప్రయత్నించారు. శంకర్‌మన్నాకు చెందిన కార్ఖానాలో సీసీటీవి దృశ్యాల కోసం పరిశీలించిన పోలీసులకు నిరాశే ఎదురైంది. సీసీటీవి పుటేజీలో దృశ్యాలు అస్పష్టంగానే ఉన్నాయి. అయితే గుంటూరు సమీపంలో నిందితులు వదిలేసిన కారులో నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్లు, క్రెడిట్‌కార్డులు, ఇతర వస్తువులు నిందితులను పట్టుకొనేందుకు ఉపయోగపడ్డాయి.

Recommended Video

Vijayawada beggar donates silver crown to Lord Ram, Watch Video | Oneindia News
102 మందితో 11 బృందాల ఏర్పాటు

102 మందితో 11 బృందాల ఏర్పాటు

ఈ నిందితులను అరెస్టుచేసేందుకు 102 మందితో 11 బృందాలను ఏర్పాటుచేశారు. ఓ డిసిపి, నలుగురు ఏసీపీలు, ఏడుగురు ఇన్స్‌పెక్టర్లు, కానిస్టేబుళ్ళతో బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించి ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు. నిందతులను పట్టుకొనేందుకు పోలీసుల బృందాలు తమిళనాడు, మహరాష్ట్ర, పశ్చిమబంగా, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో వేట సాగించాయి.

దర్యాప్తు కోసం విమానాల్లో పర్యటన

దర్యాప్తు కోసం విమానాల్లో పర్యటన

ఈ కేసును అతి త్వరగా చేధించాలనే ఉద్దేశ్యంతో విజయవాడ పోలీసులు విమానాల్లో కూడ పర్యటించారు. రోడ్డు మార్గాన వెళ్తే ఆలస్యమౌతోందని, నిందితులు తప్పించుకొనిపోయే ప్రమాదం ఉందని భావించి కొన్ని సమయాల్లో విమానప్రయాణాలు కూడ చేశారు. ఆయా ప్రాంతాల్లోని పాత నేరస్థుల వివరాలను సేకరించారు. ఈ సందర్భంలోనే పోలీసులకు మంచి క్లూ దొరికింది.

మాజీ ఉద్యోగి ఫోన్లపై నిఘా

మాజీ ఉద్యోగి ఫోన్లపై నిఘా

శంకర్‌మన్నాకు చెందిన కార్ఖానాలో తన్మయి అనే వ్యక్తి గతంలో పనిచేశాడు. అతడి సెల్‌ఫోన్‌పై నిఘాను పెట్టారు. దీంతో కీలక విషయాలు బయటకు వచ్చాయి. దోపిడికి పాల్పడిన నిందితులతో తన్మయికి సంబంధం ఉందని తేలింది. నిందితులతో తన్మయి తరచూ ఫోన్లతో మాట్లాడుతున్న విషయాలను పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన పోన్లపై నిఘా పెట్టారు. తన్మయిని విచారించడంతో అసలు విషయాలు వెలుగుచూశాయి.

మూడు దిక్కులకు పారిపోయిన దొంగలు

మూడు దిక్కులకు పారిపోయిన దొంగలు

గుంటూరు నుండి నిందితులు మూడు దిక్కులకు పారిపోయారు. అయితే ఓ బృందం తిరుపతికి వెళ్ళింది. అక్కడ లాడ్జీలో మకాం వేసింది. ఇందులో తమిళనాడుకు చెందిన పాత నేరస్థుడు సురేష్ అయ్యకుట్టితేవర్ ఉండడంతో అనంతరం అక్కడి నుండి తిరునల్వేలికి వెళ్ళారు. అయితే అక్కడికి కూడ పోలీసులు విచారిస్తున్నారని తెలుసుకొని రామేశ్వరం వెళ్ళారు.

శ్రీలంక వెళ్ళేందుకు ప్లాన్

శ్రీలంక వెళ్ళేందుకు ప్లాన్

సముద్ర మార్గంలో శ్రీలంక వెళ్ళేందుకు నిందితులు ప్రయత్నించారు.పడవను కిరాయికి మాట్లాడుకొనేందుకు ప్రయత్నించారు. అయితే సాధ్యంకాకపోవడంతో చెన్నైకు వెళ్ళిపోయారు. అక్కడి నుండి బెంగుళూరుకు చేరుకొన్నారు. అక్కడ లాడ్జీలో మకాం వేశారు. తిరిగి పూణె వెళ్ళారు. అక్కడి నుండి ముంబై వెళ్ళారు అక్కడ వాటాలు పంచుకోవాలని ప్లాన్ చేశారు. ఐదుగురు నిందితులు అక్కడికి చేరుకొన్నారు. ముంబైలోని విరార్ ప్రాంతంలోని మురికివాడల్లో ఎక్కువ దోపిడిగ్యాంగులుంటాయి. అక్కడ వారికోసం పోలీసులు ప్రతికూల పరిస్థితుల్లోనూ వేట సాగించారు.

నిందితులను పట్టుకొనేందుకు సమాచారమిచ్చిన సంజయ్

నిందితులను పట్టుకొనేందుకు సమాచారమిచ్చిన సంజయ్

విజయవాడలోని శంకర్‌మన్నా కార్ఖానాలో దోపిడి ఘటనపై సంజయ్‌కుమార్ మోహతా అనే వ్యక్తి విజయవాడ కమిషనర్ గౌతంసవాంగ్‌కు సమాచారమిచ్చాడు. అంతేకాదు నిందితులు ఉపయోగించిన కారును, ఫోన్ల గురించి సమాచారమిచ్చాడు.తనకు తెలిసిన కానిస్టేబుల్ ఈ సమాచారాన్ని నిందితులను పట్టుకోవాలని పురమాయించాడు. దోపిడికి పాల్పడినవాిరలో యూపీకి చెందిన సంతోష్ ఆదిత్య బన్స్‌రాజ్ అలియాస్ జగుదుపై 9 కేసులు, ముంబైకి చెందిన దశరథ్ దగుడు దాకింగర్, అలియాస్ దత్తపై 15 కేసులున్నాయి. తమిళనాడుకు చెందిన సురేష్అయ్యకుట్టితేవర్‌పై 7కేసులు, ముంబైకి చెందిన ఖాజా మొహీనొద్దీన్‌ఖాన్‌పై ఒక కేసుంది. ముంబైకి చెందిన సంతోష్ రతన్‌సింగ్ ఠాకూర్ అలియాస్ సంతోష్ నేపాల్‌పై మహరాష్ట్రలో 9 కేసులున్నాయి. దిలీప్‌పై రాజమండ్రిలో ఓ దోపిడి కేసు నమోదైంది. వీరంతా ముంబైలో జైలు శిక్షను అనుభవించారు. ఏడాది ఫిబ్రవరి, మార్చిలోనూ రెక్కీ నిర్వహించారు. ఈ నెల 10న,,దోపిడికి ప్లాన్ చేశారు. ఆరోజు కుదరకపోవడంతో తమ ప్లాన్‌ను మరునాటికి వాయిదా వేసుకొన్నారు.

English summary
Vijayawada City police have successfully solved the gold heist case in 13 days and arrested seven of the ten accused in the case. They also recovered the stolen gold weighing 4.025 kg out of the stolen 5 kg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X