వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైజాగ్‌లో ఏసీబీ వలకు మరో పెద్ద చేప(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: నగరంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల వలకు మరో చేప చిక్కింది. ఆడిట్‌ ఆనుకూలంగా చేసేందుకు ఒక నగల దుకాణం యజమాని నుంచి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ రూ. లక్షన్నర లంచం తీసుకుంటుండగా సోమవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ డీఎస్పీ కె. రామకృష్ణ ప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. టౌన్ కొత్తరోడ్డ వద్ద ఎం. శ్రీనివాసరావు అనే వ్యక్తి శ్రీశ్రీనివాస జ్యూవెలర్స్ పేరుతో నగల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న శ్రీనివాసరావు దుకాణంలో స్టీల్ ప్లాంట్ సర్కిల్-2 టీసీటీవో పామల కమలరావు తనికీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రికార్డు ప్రకారం ఉండాల్సిన దానికంటే దుకాణంలో ఎక్కువ బంగారం ఉందంటూ కొన్ని రికార్డులను సీజ్ చేశారు. అనంతరం ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి వ్యాపారి నుంచి మూడ లక్షల రూపాయలు తీసుకున్నాడు.

 లంచం తీసుకుంటూ పట్టబడ్డ డీసీటీవో కమలరావు

లంచం తీసుకుంటూ పట్టబడ్డ డీసీటీవో కమలరావు

ఆ తర్వాత దుకాణం యజమాని ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్ బకాయిలు అధికంగా ఉన్నాయని ఉన్నాతాధికారులకు తప్పుడు నివేదిక పంపించి ఆడిట్ చేయించేందుకు అనుమతి సంపాదించాడు.

 లంచం తీసుకుంటూ పట్టబడ్డ డీసీటీవో కమలరావు

లంచం తీసుకుంటూ పట్టబడ్డ డీసీటీవో కమలరావు

ఏప్రిల్ నెలలో అనుమతి వచ్చినప్పటికీ ఆడిట్ చేయకుండా కమలరావు ఆలస్యం చేస్తూ వస్తున్నారు. దీనిపై కమలరావును దుకాణం యజమాని శ్రీనివాసరావు సంప్రతించగా తనకు మరో మూడు లక్షల రూపాయలు లంచం ఇస్తేనే ఆడిట్ చేస్తానని తేల్చి చెప్పారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రికార్డులను సీజ్ చేయాల్సిన అవసరం లేకపోయినా కమలరావు రికార్డులను సీజ్ చేయడమే కాకుండా వ్యాపారి నుంచి రెండు బ్లాంక్ చెక్‌‌లను తీసుకొని తన సొంతానికి వాడుకున్నారని అన్నారు.

 లంచం తీసుకుంటూ పట్టబడ్డ డీసీటీవో కమలరావు

లంచం తీసుకుంటూ పట్టబడ్డ డీసీటీవో కమలరావు

నగరంలో బంగారు దుకాణాల నుంచి ఏడాదికి కొంత మామూళ్లు వసూలు చేస్తున్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు.

 లంచం తీసుకుంటూ పట్టబడ్డ డీసీటీవో కమలరావు

లంచం తీసుకుంటూ పట్టబడ్డ డీసీటీవో కమలరావు

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రికార్డులను సీజ్ చేయాల్సిన అవసరం లేకపోయినా కమలరావు రికార్డులను సీజ్ చేయడమే కాకుండా వ్యాపారి నుంచి రెండు బ్లాంక్ చెక్‌‌లను తీసుకొని తన సొంతానికి వాడుకున్నారని అన్నారు.

English summary
Visakha Commercial Tax Officer caught by ACB while taking Bribe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X